జాతీయ వార్తలు

గోవా అసెంబ్లీని రద్దు చేసే అవకాశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పనాజి, జనవరి 22: గోవా అసెంబ్లీని రద్దు చేసే అవకాశం ఉందని మంగళవారం కాంగ్రెస్ పార్టీ తెలిపింది. జనవరి 29 నుంచి మూడు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తున్నారని, ఈ సెషన్‌లోనే ఓట్-ఆన్-అకౌంట్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టి సమావేశాలు ముగియగానే అసెంబ్లీ రద్దు చేయవచ్చునని సీఎల్‌పీ నేత చంద్రకాంత్ కావ్‌లేకర్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర సమస్యలు చర్చించేందుకు మూడు రోజులు ఏమాత్రం సరిపోవని, గవర్నర్ ప్రసంగానికే ఒక రోజు పోతుందని ఆయన తెలిపారు. ఇదే విషయాన్ని సోమవారం జరిగిన బీఏసీ సమావేశంలోనూ వెల్లడించినట్లు ఆయన చెప్పారు. అసెంబ్లీ సమావేశాలకు ఎక్కువ రోజులు కేటాయిస్తామని ఇంతకుముందు ముఖ్యమంత్రి మనోహర్ పారికర్ హామీ ఇచ్చారని, అయినప్పటికీ కేవలం మూడు రోజులు మాత్రమే నిర్వహించడం సమంజసం కాదని అన్నారు. గత ఏడాదిలో కేవలం 16 రోజులు మాత్రమే సమావేశాలు జరిగాయని ఆయన వెల్లడించారు.