జాతీయ వార్తలు

బ్యాలెట్ పేపర్‌తోటే ఎన్నికలు నిర్వహించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో, జనవరి 22: ఈవీఎంలతో పలు అక్రమాలు జరిగాయని ఆరోపణలు వస్తున్నందున వచ్చే లోక్‌సభ ఎన్నికలను బ్యాలెట్‌పేపర్‌తో నిర్వహించాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాం డ్ చేశారు. 2014 లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈవీఎంల ద్వారా రిగ్గింగ్ జరిగిందని భారత్‌కు చెందిన సైబర్ నిపుణుడు లండన్‌లో ఆరోపించిన నేపథ్యంలో ఆమె మాట్లాడుతూ ఈవీఎంలపై ప్రస్తుతం అనేక సందేహాలు వస్తున్నాయని అన్నారు. అందుకే ఎలాంటి అనుమానాలు, వివాదాలకు తావు లేకుండా వచ్చే లోక్‌సభ ఎన్నికలను ఈవీఎంల ద్వారా కాకుండా బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించాలని ఆమె కోరారు. బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరిపితే మూడు దశల్లో మనం దానిని పరిశీలించే అవకాశం ఉంటుందని, ఈవీఎంలకు ఆ వెసులుబాటు లేదని ఆమె అన్నారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసి బీజేపీకి ఓట్లు పడేలా చేశారని విచ్చిన ఆరోపణలను ఆమె ప్రస్తావిస్తూ, ఈ సంచలన ఆరోపణలు విజయానికి బీజేపీ కుట్ర చేసిందని వెల్లడిస్తున్నాయని అన్నారు. ఈవీఎంలలో అక్రమాలు జరుగుతున్నాయని మొదట ఆరోపించింది తమ పార్టీయేనని, తాము వేసిన ఓట్లు ఒక పద్ధతి ప్రకారం దారి మళ్లుతున్నాయని ప్రజలు సైతం ఆరోపిస్తున్నారని ఆమె పేర్కొంది. ఈ నేపథ్యంలో ఓటు మాది, పాలన మీదా అంటూ మండిపడుతున్నారని అన్నారు.
ఇలావుండగా, భారత్‌కు చెందిన సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా సోమవారం లండన్ నుంచి స్కైప్ ద్వారా విలేఖరులతో మాట్లాడుతూ 2014లో ఈవీఎంల పనితీరు పరిశీలనకు సంబంధించిన బృందంలో తానూ ఒకడినని చెప్పారు. ఈవీఎంలలో లోపాలున్నాయని, దానిని ట్యాంపరింగ్ చేశానని తమ బృందం నిర్ధారించిందని, ఈ నేపథ్యంలో తమ బృందంలోని కొందరు హత్యకు గురవ్వడంతో భయంతో తాను 2014లో లండన్ పారిపోయినట్టు చెప్పాడు. ముఖానికి మాస్క్‌తో మాట్లాడిన సయ్యద్ తన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలను మాత్రం వెల్లడించలేదు. టెలికాం దిగ్గజం రిలయన్స్ జియో సాయంతో తక్కువ ఫ్రిక్సెన్సీ సిగ్నల్స్‌ను ఈవీఎంలకు పంపి దానిని హ్యాక్ చేసి బీజేపీకి అనుకూలంగ ఓట్లు పడేలా 2014 ఎన్నికల్లో చేశారని ఆయన తీవ్ర ఆరోపణ చేశారు.