జాతీయ వార్తలు

అది కాంగ్రెస్ కుట్రే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జనవరి 22: గత లోక్‌సభ ఎన్నికల్లో భారీగా రిగ్గింగ్ జరిగిందంటూ వచ్చిన ఆరోపణలను కేంద్రంలోని అధికార బీజేపీ మంగళవారం తీవ్ర స్వరంతో ఖండించింది. ఇదంతా భారత ప్రజాస్వామ్యాన్ని, ఎన్నికల కమిషన్‌ను భ్రష్టు పట్టించేందుకు కాంగ్రెస్ నేతృత్వంలో సాగిన కుట్రగా అభివర్ణించింది. లండన్‌లో జరిగిన మీడియా సమావేశంలో సయ్యద్ షుజా అనే ఓ సైబర్ నిపుణుడు భారత ఈవీఎంలను ట్యాంపర్ చేయవచ్చునని, 2014లో లోక్‌సభ ఎన్నికల్లో రిగ్గింగ్ జరిగిందంటూ ఆరోపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకత్వం మంగళవారం కాంగ్రెస్‌పై విరుచుకుపడింది. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కూడా పరాజయం తప్పదన్న భయంతోనే కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పటినుంచే కుంటిసాకులు వెతుక్కుంటున్నారని కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ అన్నారు. లండన్ మీడియా సమావేశానికి కాంగ్రెస్ నాయకుడు కపిల్ సిబల్ హాజరుకావడాన్ని రవిశంకర్ ప్రసాద్ ప్రశ్నించారు. అసలు ఆయనకు అక్కడకు వెళ్లాల్సిన అవసరం ఏమిటని ఏ హోదాలో ఆ మీడియా సమావేశంలో పాల్గొన్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు అనుకూలంగా ఈ మీడియా భేటీని మలచే ఉద్దేశంతో సిబల్ అక్కడకు వెళ్లినట్లు స్పష్టమవుతోందని అన్నారు. కచ్చితంగా ఈవీఎంలపై వచ్చిన ఆరోపణలు కాంగ్రెస్ కుట్రేనని, ఇదంతా కాంగ్రెస్ స్క్రిప్టు ప్రకారం సాగిన వ్యవహారమేనన్నారు.
అయితే వ్యక్తిగత హోదాలోనే తాను లండన్ వెళ్లినట్లుగా సిబల్ చేసిన ఆరోపణలను కొట్టివేసిన కేంద్ర మంత్రి ‘తాను ఆ మీడియా భేటీకి హాజరైతే ఎలాంటి పరిణామాలు తలెత్తుతాయో ముందే తెలిసి సిబల్ ఇలా వ్యవహరించారు’ అని రవిశంకర్ ప్రసాద్ వ్యాఖ్యానించారు.