జాతీయ వార్తలు

దేశంలో దోపిడీని అరికట్టాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి: ప్రధాని నరేంద్రమోదీ కాంగ్రెస్‌పై మరోసారి విరుచుకుపడ్డారు. దేశాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ అవినీతిని పెంచి పోషించిందని మోదీ ఆరోపించారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక అవినీతికి అడ్డుకట్టవేసినట్టు ఆయన స్పష్టం చేశారు. ఈ నాలుగున్న ఏళ్లలో దోపిడీని అరికట్టినట్టు ప్రధాని తెలిపారు. రూపాయిలో 15 పైసలే ప్రజలకు చేరుతున్నాయని ఓ కాంగ్రెస్ మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ చేసిన వ్యాఖ్యలను ఆయనీ సందర్భంగా పరోక్షంగా ప్రస్తావించారు. దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రజాధనం దుర్వినియోగాన్ని ఆపలేకపోయిందని ప్రధాని మోదీ ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 5,80,000 కోట్ల రూపాయల పథకాలు ప్రజలకు ప్రత్యక్షంగా అందించినట్టు ఆయన తెలిపారు. 15వ ప్రవాస భారతీయ దివస్ సందర్భంగా ఎన్నారైలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఎన్నారైలే భారత్‌కు బ్రాండ్ అంబాసిడర్లుగా మోదీ అభివర్ణించారు. భారత శక్తి సామర్థ్యాలకు ఎన్నారైలు చిహ్నాలని ఆయన ప్రశంసించారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక ప్రజల ఆలోచనా విధానంలో మార్పుతెచ్చినట్టు ఆయన పేర్కొన్నారు. జాతీయత, భారతీయతను ఇనుమడించేలా కృషి జరిగిందని ఆయన చెప్పారు. మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్, విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, హర్యానా సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్, ఉత్తరాఖండ్ సీఎం త్రివేంద్ర సింగ్ రావత్, యూపీ గవర్నర్ రాంనాయక్, విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్ ప్రభృతులు సదస్సుకు హాజరయ్యారు. భారత్ సేవలు ప్రపంచ స్థాయిలో గుర్తింపును పొందాయని ప్రధాని వివరించారు. అంతర్జాతీయ సమాజంలో నిరుపమాన సేవలు అందిస్తున్నట్టు ఆయనీ సందర్భంగా తెలిపారు. ముఖ్యంగా పర్యావరణానికి సంబంధించి భారత్ ఎంతో కృషి చేస్తోందని ఆయన వెల్లడించారు. ‘కాంగ్రెస్ హయాంలో అవినీతి ఓ వ్యాధిగా తయారైంది. నయం చేయడానికి వీలులేని పరిస్థితి ఉండేది. మేం అధికారంలోకి వచ్చాక ప్రక్షాళన చేశాం’అని మోదీ ప్రకటించారు. గతంలో లీకేజీలు, దోపిడీలు ఆపడానికి చిన్న ప్రయత్నమయినా చేశారా?అని కాంగ్రెస్‌ను నిలదీశారు. మధ్యతరగతి ప్రజలను లూటీ చేశారని ఆయన తీవ్ర ఆరోపణ చేశారు. ‘నేను ఓ వాస్తం చెబుతున్నా... సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దోపిడీని సమూలంగా ఆపేశాం’అని ప్రధాని పేర్కొన్నారు. వివిధ సంక్షేమ పథకాలకు 5,80,000 కోట్ల రూపాయలు వెచ్చించినట్టు ఆయన అన్నారు. పథకాల ఫలాలు నేరుగా ప్రజలకే అందుతున్నాయని ఆయన వెల్లడించారు. నగదు బదిలీ ద్వారా ప్రజలకు ప్రత్యక్షంగా మేలుచేకూర్చినట్టు ఎన్నారై సదస్సులో ఆయన చెప్పారు. గృహ నిర్మాణం, విద్యారుణాలు, ఉపకారవేతనాలు, గ్యాస్ సిలెండర్లు వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అవినీతికి తావులేకుండా పక్కా ప్రణాళికతో పథకాలు అమలు జరుగుతున్నాయని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు.‘ వ్యవస్థలో మార్చులు తీసుకొచ్చి పథకాలు అమలుచేస్తేనే అర్హులకు ఫలాలు అందుతాయి. లేని పక్షంలో లీకేజీలు, లూటీలు చెలరేగిపోతాయి’అని ఆయన పేర్కొన్నారు. తమ ప్రభుత్వం ఏడు కోట్ల మంది నకిలీ లబ్ధిదారులను గుర్తించిందని ఆయన అన్నారు. కేవలం కాగితాలమీదే పేర్లు తప్ప వాస్తవంగా ఉండేవారు కాదని, వారి పేరుతో నిధులు కైంకర్యం అవుతుండేవని ఆయన విమర్శించారు. ప్రవాస భారతీయ దివస్ మూడు రోజులు పాటు జరగనుంది. మారిషస్ ప్రధాని ప్రవింద్ జగన్నాథ్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రవేశపెట్టిన నైపుణ్యభారత్, బేటీ బచావో బేటీ పఢావో పథకాలపై మారిషస్ పీఎం ప్రశంసలు కురిపించారు. మారిషస్‌లో వచ్చే నెలలో భగవత్‌గీతా మహోత్సవ్, వచ్చే ఏడాది భోజ్‌పురి పండుగను నిర్వహిస్తామని ప్రకటించారు.
చిత్రం..మంగళవారం వారణాసిలో 15వ భారతీయ ప్రవాసీ దినోత్సవ సదస్సు ప్రారంభోత్సవంలో మాట్లాడుతున్న ప్రధాని మోదీ