రాష్ట్రీయం

కాపులకు 5 శాతం కోటాపై అభ్యంతరం ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జనవరి 23: రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ, వైకాపా ప్రయత్నిస్తున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆరోపించారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్ కల్పిస్తే, అభ్యంతరం ఏమిటని ఆ రెండు పార్టీలను ప్రశ్నించారు. అవినీతిని నియంత్రించామని ప్రధాని మోదీ చెప్పడం హాస్వాస్పదం అంటూ ధ్వజమెత్తారు. ఉండవల్లిలోని సీఎం నివాసం నుంచి బుధవారం టీడీపీ ఇన్‌చార్జిలు, ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులు, పార్టీ కమిటీల బాధ్యులతో బుధవాం చంద్రబాబు టెలీకాన్ఫరెన్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ కులాల మధ్య చిచ్చు పెట్టాలన్న ప్రతిపక్షాల కుట్రను తిప్పికొట్టాలన్నారు. అగ్రకులాల్లో కాపులు సగానికిపైగా ఉన్నారని, కాపు, బలిజ, ఒంటరి, తెలగ కులాల శాతమే అధికమని
గుర్తు చేశారు. అందుకే ఈబీసీ 10 శాతం రిజర్వేషన్‌లో కాపులకు 5 శాతం ఇచ్చామన్నారు. కాపు రిజర్వేషన్లపై బీజేపీ, వైకాపా నేతలు వక్రీకరిస్తున్నారని, ఢిల్లీ వెళ్లి కాపుల రిజర్వేషన్ల గురించి అడగలేని అసమర్థులు వాళ్లని ఎద్దేవా చేశారు. కాపులకు మేలు చేసే టీడీపీని విమర్శిస్తున్నారన్నారు. కాపుల రిజర్వేషన్ బిల్లును అసెంబ్లీలో ఆమోదించి, ఢిల్లీకి పంపామని, దానిపై ఏనాడైనా బీజేపీ, వైకాపా నేతలు మాట్లాడారా అని ప్రశ్నించారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తామని మోసం చేసింది వైఎస్ అని ఆరోపించారు. కాపులకు 5 శాతం రిజర్వేషన్‌పై ఆ రెండు పార్టీలకు ఉన్న అభ్యంతరం ఏమిటని ప్రశ్నించారు. అవినీతిని 85 శాతం నియంత్రించామని మోదీ చెప్పడం హాస్యాస్పదమని వ్యాఖ్యానించారు. రాఫెల్ 43 వేల కోట్ల రూపాయల కుంభకోణం అంటే అవినీతి నియంత్రణా అని విమర్శించారు. వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి విదేశాలకు పరార్ కావడం అవినీతి నియంత్రణా అని ప్రశ్నించారు. బ్యాంక్‌లను మోసం చేయడం కూడా నియంత్రణేనా అన్నారు. నమ్మకమే బ్యాంకింగ్ వ్యవస్థలకు మూల స్తంభమని, మోదీ పాలనలో మూల స్తంభానే్న కూలగొట్టారని విమర్శించారు. బ్యాంకింగ్ వ్యవస్థపై భద్రతను, ప్రజల నమ్మకాన్ని దెబ్బతీశారన్నారు. వేల కోట్లు బ్యాంక్‌లకు ఎగ్గొట్టి విదేశాలకు పరారయ్యారన్నారు. దావోస్‌లో రఘురామ రాజన్ వ్యాఖ్యలు మోదీ పాలన డొల్లతనాన్ని బయటపెట్టాయన్నారు. బీజేపీ పాలనలో సంస్కరణలు పడకేశాయనే ఆందోళన ఉందని, ఉద్యోగాల సృష్టి సక్రమంగా జరగలేదనే బాధ ఉందన్నారు. గతంలో ఉన్న స్వేచ్ఛ ఇప్పుడు లేదన్న ఒత్తిడి ఆర్బీఐకి ఉందన్నారు. కోల్‌కతా ర్యాలీ ప్రకంపనల నుంచి అమిత్ షా, మోదీ తేరుకోలేదని వ్యాఖ్యానించారు. ఈవీఎంలపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోందని, ఆ చర్చను పక్కదారి పట్టించాలని బీజేపీ చూస్తోందన్నారు. మళ్లీ బ్యాలెట్ పేపరు కావాలనేది అందరి డిమాండ్ అన్నారు. లేదా వీవీ ప్యాట్ రశీదులు 100 శాతం నియోజకవర్గాల్లో ఇవ్వాలని డిమాండ్ చేశారు.
దావోస్‌లో మంత్రి లోకేష్ పర్యటన సత్ఫలితాలు ఇస్తోందన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అనేక కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయన్నారు. 13 జిల్లాల్లో పారిశ్రామీకరణలో ఇదో ముందంజగా అభివర్ణించారు. పెట్టుబడులకు అనుకూలమైన వాతావరణం నెలకొందన్నారు. జడ్‌బీఎన్‌ఎఫ్‌పై వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడానని, మన ప్రకృతి సేద్యంపై ప్రపంచం మొత్తం ఆసక్తి చూపిస్తోందన్నారు. సాంకేతికతతో సహకరించేందుకు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. 24 వేల కోట్ల రూపాయల రుణమాఫీ రైతులకు చేశామని, కౌలు రైతులకు 5 వేల కోట్ల రూపాయల రుణాలు ఇవ్వడం దేశంలోనే చరిత్ర అన్నారు. పశుగ్రాస విధానం తెచ్చామని, వీటన్నింటినీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలన్నారు. పేదల సంక్షేమానికి తీసుకున్న చర్యలు వివరించాలన్నారు. ఆటోలు, ట్రాక్టర్లపై పన్ను తొలగింపు ఎంతో ఊరటనిచ్చే అంశమన్నారు. ప్రతి ఆటో డ్రైవర్ టీడీపీకి అండగా ఉండాలని పిలపునిచ్చారు. ఆటోలు, ట్రాక్టర్లపై టీడీపీ జెండా ఎగరాలన్నారు. టీడీపీ స్టిక్కర్లతో ఆటోలకు కొత్త అందాలు రావాలన్నారు. కార్యకర్తలంతా ఐక్యంగా పని చేయాలని దిశానిర్దేశం చేశారు. 36 సంవత్సరాలుగా పార్టీ జెండా మోస్తూ, పార్టీ కోసం పరితపిస్తున్నారన్నారు.