జాతీయ వార్తలు

బల్విందర్ సింగ్ సంధ్ ‘83’లో పంజాబీ స్టార్ అమీవిర్క్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబై, జనవరి 23: ‘83’ తారాగణంలో తాజాగా అమీవిర్క్ చేరాడు. భారత్ బౌలింగ్‌లో గొప్ప ఆటగాడుగా రాణించిన బల్విందర్ సింగ్ సంధ్ పాత్రలో అతడు కనిపించనున్నాడు. 1983లో బ్లూస్ మెన్ ఫైనల్‌లో వెస్టిండీస్‌ను ఓడించి వారి మొట్ట మొదటి వరల్డ్ కప్ ట్రోఫీని కపిల్‌దేవ్ కెప్టెన్ సారథ్యంలో భారతదేశం గెలుపొందింది. కబీర్‌ఖాన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విర్క్ బాలీవుడ్ ప్రవేశాన్ని ప్రారంభించింది. సంధ్ ఒక బ్యాట్స్‌మన్, బౌలర్. వెస్టిండీస్‌తో జరిగిన ఫైనల్‌లో గోర్డాన్ గ్రీనిడ్జ్‌కు క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. మాజీ భారతీయ క్రీడాకారుడు ఈ సినిమా తారాగణంకు శిక్షణ కూడా ఇస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్ 10, 2020న విడుదల కానుంది. ‘83’ను మధు మంతెనా, విష్ణు ఇందిర, ఖాన్ సంయుక్తంగా నిర్మించారు. దీనిని రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పించారు.