జాతీయ వార్తలు

పాజిటివ్ బజ్‌లో గూగుల్ ఫస్ట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, జనవరి 23: వాణిజ్య, డిజిటల్ బ్రాండ్ల సమాచారం తెలుసుకోవడానికి, ఎక్కువ సంఖ్యలో ఉపయోగించుకునే సమాచార సాధనంలో గూగుల్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఫేస్‌బుక్ నిర్వహిస్తున్న వాట్సాప్, మూడవ స్థానంలో గూగుల్ ఆధీనంలోని యూటూబ్ నిలిచాయి. గూగుల్ 57.2 పాయింట్ల స్కోరుతో అగ్రగామిగా నిలిచినట్లు ఇంగ్లాండ్‌కు చెందిన ఆన్‌లైన్ మార్కెట్ రీసెర్చి డాటా అనలిటిక్స్ సంస్థ యువర్ గవర్నమెంట్ (యూ గవ్) తెలిపింది. బజ్ స్కోర్ల ద్వారా ప్రామాణికతను నిర్థారించినట్లు చెప్పారు. గత రెండు వారాల్లో ఒక డిజిటల్ బ్రాండ్ గురించి మంచి లేదా చెడు ఏమి విన్నారనే విషయం తెలుసుకోవడాన్ని బజ్ స్కోర్ అంటారు. సామాజిక మాధ్యమాల్లో డిజిటల్ బ్రాండ్స్ ప్రచారం ఎక్కువగా ఉంటుంది. టెక్నాలజీ వల్ల గూగుల్, ఫేస్‌బుక్ వాట్సప్, యూటూబ్ పోటీపడుతున్నాయి. ఈ మూడు సంస్థలకు అపారమైన టెక్నాలజీ ఉంది. ప్రపంచంలోనే అత్యుత్తమైన సమాచార టెక్నాలజీతో ఈ సంస్థలు రాణిస్తున్నాయి. టికెటింగ్ పోర్టల్ మేక్‌మై ట్రిప్ నాల్గవస్థానంలో నిలిచింది. ఆ తర్వాత ఆమెజాన్, ఓబర్, ఓలా సర్వీసుల కోసం సెర్చ్ ఎక్కువగా ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. ఆహారాన్ని డెలివరీ చేసే స్వీగ్గీ పెట్టుబడులతో తమ వ్యాపారాన్ని విస్తరించుకునేందుకు ప్రణాళికలను ఖరారు చేసుకుంది. ఈ సంస్థ పదవ స్థానంలో నిలిచింది. గత ఏడాదిలో జొమాటో బ్రాండ్ తన స్థానాన్ని మెరుగుపరుచుకుంటోంది. ఫైనాన్షియల్ బ్రాండ్స్ కూడా మంచి ప్రగతిని నమోదు చేసుకుంటున్నాయి.