జాతీయ వార్తలు

కాంగ్రెస్‌కు మరింత ఉత్సాహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దావోస్, జనవరి 23: యూపీ రాష్ట్రానికి జనరల్ సెక్రటరీలుగా ప్రియాంక గాంధీ వాద్రా, జ్యోతిరాదిత్య సింధియాలను నియమించడం పట్ల మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కమల్‌నాథ్ హర్షం వ్యక్తం చేశారు. వీరి నియామకంతో వచ్చే లోక్‌సభ ఎన్నికలకు పార్టీకి మరింత బలం, ఉత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. ఈమె నియామకంపై గత ఆరు నెలలుగా తర్జనభర్జనలు జరుగుతున్నాయని, ఎట్టకేలకు ఆమె క్రియాశీల రాజకీయాల్లోకి రావడం వల్ల ఉత్తరప్రదేశ్‌కే కాక దేశమంతటా కాంగ్రెస్‌కు ఉత్సాహాన్ని ఇస్తుందని ఆయన అన్నారు. ఇక్కడ జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సమావేశానికి హాజరై న ఆయన పీటీఐతో మాట్లాడుతూ ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ పార్టీ కోసం ఎంత కృషి చేస్తున్నామో ప్రియాంక నియామకంతో పార్టీ వర్గాలకు అధిష్టానం తెలియజేసిందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో జ్యోతిరాదిత్య సింధియాది చాలా ముఖ్యమైన భూమిక అని, ఈ యువనేత రాష్ట్రంలో తన పాత్రను సమర్థవంతంగా పోషిస్తాడని ఆయన అన్నారు. కాగా, వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించే రాష్ట్రంగా అందరి దృష్టి ఉత్తరప్రదేశ్‌పై ఉంది. 80 స్థానాలున్న ఈ రాష్ట్రానికి ప్రధాని అభ్యర్థిని నిర్ణయించే సత్తా ఉంది. దీంతో అన్ని పార్టీలు దీనిపై దృష్టి పెట్టిన నేపథ్యంలో కాంగ్రెస్‌ను మరింత పటిష్టం చేసే ఉద్దేశంతో ప్రియాంను యూపీ ఉత్తర ప్రాంతానికి ఏఐసీసీ జనరల్ సెక్రటరీగా నియమిస్తూ రాహుల్ నిర్ణయం తీసుకోవడం పట్ల పార్టీ వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. రాహుల్, సోనియా ప్రాతినిధ్యం వహిస్తున్న అమేథి, రాయబరేలి ఈ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇప్పటికే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి సీఎం యోగి ఆదిత్యనాథ్, ప్రధాని నరేంద్ర మోదీ వంటి ఇద్దరు ఆకర్షణ గల నేతలు ఉన్నారు. నరేంద్రమోదీ ఇక్కడ వారణాసి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్‌కు ప్రియాంక లాంటి నేత చాలా అవసరమని యూపీ పీసీసీ అధికార ప్రతినిధి రాజీవ్ భక్షి పేర్కొన్నారు. యూపీలో ఇద్దరు నేతలను జనరల్ సెక్రటరీలుగా నియమించడం చూస్తే రాష్ట్రంపై రాహుల్‌కు ఉన్న శ్రద్ధను అర్థం చేసుకోవచ్చునని యూపీసీసీ జనరల్ సెక్రటరీ ద్విజేంద్ర త్రిపాఠి అన్నారు. వారిద్దరికీ ప్రజల్లో మంచి ఆదరణ ఉందని, నాయకత్వ లక్షణాలు పుష్కళంగా ఉన్నాయని, యూపీలో కాంగ్రెస్ కచ్చితంగా పూర్వవైభవాన్ని సంతరించుకుంటుదని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.