జాతీయ వార్తలు

ఇచ్చిన హామీల మాటేమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: కేంద్రం ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా, విభజన హామీలను ఎక్కడా ప్రస్తావించలేదని లోక్‌సభ సభ్యుడు గల్లా జయదేవ్ మండిపడ్డారు. ఏపీకి ఇచ్చిన హామీల అమలుపై కేంద్రం వెంటనే శే్వతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై గురువారం జరిగిన చర్చలో టీడీపీ సభ్యుడు గల్లా జయ్‌దేవ్ మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ అమలు చేయడం వల్ల సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆరోపించారు. ఎన్డీయే ప్రభుత్వ పాలనలో నిరుద్యోగం బాగా పెరిగిందని, బడ్జెట్‌లో కచ్చితత్వం, జవాబుదారీతనం లోపించిందని ఆయన విమర్శించారు. 2014 ఎన్నికల సమయంలో నరేంద్ర మోదీ ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించారని ఆరోపించారు. బీజేపీ అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌కు పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామన్న హామీని అమలు చేయకుండా ఏపీ ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. 2018-19 బడ్జెట్‌లో ఆంధ్రప్రదేశ్‌కు అన్యాయం జరగడం వల్లే తెలుగుదేశం పార్టీ ఎన్డీయే నుంచి బయటకు రావడం జరిగిందని పేర్కొన్నారు. విభజన చట్టంలోని 29 అంశాలపై ఇప్పటికీ న్యాయం జరగలేదని, ఆ సమయంలో ప్రధాన మంత్రి మాన్మోహన్ సింగ్ పార్లమెంట్ సాక్షిగా ఇచ్చిన ప్రత్యేక హోదాను ప్రస్తుత ప్రభుత్వం పట్టించుకోలేదని అన్నారు. 2014లో నెల్లూరు, తిరుపతి ఎన్నికల ప్రచారానికి వచ్చిన నరేంద్ర మోదీ- ఢిల్లీ కంటే మెరుగైన రాజధానిని ఏపీకి అందిస్తామని చెప్పారని గుర్తుచేశారు.
ఎంతో రాజకీయ అనుభవం ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబును తక్కువ అంచనా వేస్తున్నారని, గతంలో కేంద్రంలో ప్రభుత్వాల ఏర్పాటులో చంద్రబాబు కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. దేశంలో 5శాతం ఉన్న ఏపీ ప్రజలు తమ హక్కుల కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం చేసి సాధించకుంటారని పేర్కొన్నారు. తమ హక్కుల కోసం మధ్యప్రదేశ్, తమిళనాడు, వివిధ రాష్ట్రాల రైతులు చేస్తున్న ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోలేదని.. అందుకే ఇటీవల జరిగిన మూడు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓటమి పాలైందని, ఇప్పుడు రైతులు గుర్తుకు వచ్చారని విమర్శించారు. రైతులను ఆదుకుంటామని చెప్పి రోజుకు రూ.17 ఇచ్చి చేతులు దులుపుకుందామని అనుకుంటున్నారని విమర్శించారు. రైతులకు ఇచ్చిన హామీలను ఏపీ ప్రభుత్వం అమలు చేసిందని, ఈ నాలుగేళ్ల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేసిందని పేర్కొన్నారు. ఏడాదికి రెండు కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామన్న బీజేపీ ఎన్నికల హామీ ఏమైందని నిలదీశారు. జీఎస్టీ అమలు, నోట్ల రద్దుతో ఉన్న ఉద్యోగాలను పోగొట్టారని ఆరోపించారు. ఐదేళ్ల వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు చివరి బడ్జెట్‌లో ఏవో తాయిలాలు ప్రకటించారని విమర్శించారు. దేశంలో పార్లమెంట్, సుప్రీం కోర్టు, ఎన్నికల సంఘం, ఆర్బీఐ, సీవీసీ, సీబీఐ, ఈడీలను ఈ ఏన్డీయే ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, అలాగే ప్రతిపక్ష పార్టీలపై దాడులు చేసేందుకు ఈ సంస్థలను ప్రేరేపిస్తున్నారని గల్లా జయదేవ్ తీవ్రంగా ఆరోపించారు.