జాతీయ వార్తలు

నా కొడుక్కే కర్నూలు టికెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: కర్నూలు శాసనసభ సీటును తన కుమారుడు భరత్‌కు కేటాయించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని కోరుతున్నట్టు తెలుగుదేశం రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ తెలిపారు. గురువారం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ కర్నూలు అసెంబ్లీ అభ్యర్థిగా తన కుమారుడు భరత్‌ను బరిలోకి దింపితే కచ్చితంగా గెలుస్తామని, అతనికే పార్టీ అధిష్టానం తప్పకుండా టికెట్ కేటాయిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ గెలిచే వారికే సీట్లు ఇస్తుందని, గెలవడు అనుకుంటే తన కొడుక్కి సైతం టికెట్ ఇవ్వదని పేర్కొన్నారు. ఈ సీటు కోసం రాష్ట్ర మంత్రి కేఈ కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారని వార్తల్లో చదివినట్టు చెప్పారు. టికెట్ కేటాయించే విషయంలో చంద్రబాబు నిర్ణయం మేరకు నడచుకుంటానని చెప్పారు. కేఈ కృష్ణమూర్తి, కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కుటుంబాల మధ్య కొన్ని తరాలుగా అంతర్గత విభేదాలు ఉన్నాయని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఇద్దరూ కలిసి పని చేయాల్సిన అవసరం ఉందని టీజీ చెప్పుకొచ్చారు. 2014 ఎన్నికల ముందు ఆనాటి పరిస్థితుల దృష్ట్యా తొలుత బీజేపీతో చంద్రబాబు జత కట్టారని, కానీ రాష్ట్రానికి అన్యాయం చేస్తుంటే విడిపోయారని పేర్కొన్నారు. కేంద్రంతో ఎప్పుడు పోరాడాలో ఆయన తెలుసని చెప్పారు. వెనుకబడిన జిల్లాలకు నిధులు ఇవ్వకుండా వేరే రాష్ట్రాలకు నిధులు ఇస్తున్నారని వెంకటేశ్ మండిపడ్డారు. ఏ రాష్ట్రానికీ ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్రం చెప్పింది కానీ కొన్ని రాష్ట్రాలకు హోదాను అమలు చేస్తున్నారని టీజీ అన్నారు.