జాతీయ వార్తలు

‘గేట్‌వే ఆఫ్ ఇండియా’ సుందరీకరణకు చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 7: దేశ వాణిజ్య రాజధాని ముంబయిలోని ‘గేట్‌వే ఆఫ్ ఇండియా’ సుందరీకరణకు మహారాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. ప్రముఖ చారిత్రక కట్టడాన్ని పరిరక్షించడానికి కార్యాచరణ రూపొందించింది. గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావుఅధ్యక్షన గురువారం ఇక్కడ జరిగిన ఉన్నతస్థాయి సమావేశానికి ముఖ్యమంత్రి దేవేందర్ ఫడ్నవీస్ ప్రభృతులు హాజరయ్యారు. గేట్‌వే ఆఫ్ ఇండియా సుందరీకరణకు సంబంధించి ఆర్చిటెక్ట్‌లతో సంప్రదించి నెల రోజుల్లోగా ఓ కార్యాచరణ సిద్ధం చేయాలని బీఎంసీ కమిషనర్ అజయ్ మెహతాను గవర్నర్ ఆదేశించారు. చారిత్రక కట్టడానికి పూర్వవైభవం తీసుకురావడానికి కృషి చేస్తామని సీఎం ఫడ్నవీస్ వెల్లడించారు. ఇరవైవ శతాబ్దంలో గేట్‌వే ఆఫ్ ఇండియాను నిర్మించారు. అరేబియా తీరాన ఏర్పాటు చేసిన ఈ కట్టడం ఆలనాపాలనా పట్టించుకోవడం లేదు. 5వ కింగ్ జార్జ్, క్వీన్ మేరి ముంబయిలోని అపోలో బందర్‌కు విచ్చేసిన సందర్భంగా 1913 మార్చి 31న నిర్మాణం మొదలెట్టారు. 1924 నాటికి గేట్‌వే నిర్మాణం పూర్తయింది.