జాతీయ వార్తలు

వణుకుతున్న ఉత్తరాఖండ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డెహ్రాడూన్, ఫిబ్రవరి 7: ఉత్తరాఖండ్‌లోని పర్వత ప్రాంత జిల్లాలలో హిమపాతం, దిగువ ప్రాంతాల్లో వర్షాలు ముంచెత్తుతుండటంతో రాష్టమ్రంతటా అతి శీతల వాతావరణం నెలకని ప్రజలు చలితో వణుకుతున్నారు. బద్రినాథ్, కేదారినాథ్, గంగోత్రి, యమునోత్రి, హేమకుండ్ సాహిబ్‌తో పాటు నందాదేవి నేషనల్ పార్కు తదితర ప్రాంతాల్లో హిమపాతం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే చమోలి, రుద్రప్రయాగ్, ఉత్తరకాశీ తదితర జిల్లాలలో ఎక్కడికక్కడ దట్టమైన మంచుగడ్డలు పేరుకుపోయాయి. అదే సమయంలో డెహ్రాడూన్ తదితర ప్రాంతాల్లో బుధవారం నుంచి ఎడతెరపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. వాతావరణం దృష్ట్యా ముందు జాగ్రత్తగా చమోలి, రుద్రప్రయాగ జిల్లాలలో స్కూళ్లు, కాలేజీలను మూసివేశారు. సోనాప్రయాగ్-కేదారినాథ్ ట్రెక్ రూట్‌ను అధికారులు మూసివేశారు. ఈ మార్గమంతా పూర్తి మంచుతో ఉందని వారు చెప్పారు. సాధ్యమైనంత త్వరలో ఈ మార్గాన్ని పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తామని వారు చెప్పారు. ఎడతెరపి లేకుండా కురస్తున్న మంచు వల్ల కేదారినాథ్, హర్షిల్, ఉత్తరకాశీ జిల్లాలలో విద్యుత్ సరఫరాకు సైతం అంతరాయం ఏర్పడుతోంది. రానున్న 24 గంటల్లో సైతం పలు చోట్ల హిమపాతంతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు, యాత్రికులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.