జాతీయ వార్తలు

యూపీలో వాజపేయి మెడికల్ వర్శిటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లక్నో: లోక్‌సభ ఎన్నికల సమీపిస్తున్న వేళ యోగి ఆదిత్యనాథ్ నాయకత్వంలోని యూపీ ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో అభివృద్ధి పథకాలకు పెద్దపీట వేసింది. ముఖ్యంగా బీజేపీ అగ్రనేత, దివంగత మాజీ ప్రధాని ఏబీ వాజపేయి పేరుతో ఓ మెడికల్ యూనివర్శిటీని ప్రకటించారు.
వర్శిటీకి ఏర్పాటుకు సంబంధించి బడ్జెట్‌లో 50 కోట్ల రూపాయలు కేటాయించారు. అలాగే పది కోట్ల రూపాయలు ఆయుష్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేటాయించారు. అసెంబ్లీలో యూపీ ఆర్థిక మంత్రి రాజేష్ అగర్వాల్ బడ్జెట్‌ను ప్రతిపాదించారు. రాష్ట్రంలో వైద్య రంగానికి భారీగా కేటాయింపులు జరిగాయి. జిల్లా కేంద్రాల్లోని ఆసుపత్రుల ఆధునీకరణకు 908 కోట్ల రూపాయలు ప్రతిపాదించారు. అలాగే లక్నోలోని కింగ్ జార్జి మెడికల్ యూనివర్శిటీ(కేజీఎంయూ) అభివృద్ధి పనులకు 907 కోట్ల రూపాయలు వెచ్చించనున్నారు. అలాగే సంజయ్ గాంధీ పీజీ మెడికల్ సైనె్సస్, డాక్టర్ రామ్‌మనోహర్ లోహియా ఇనిస్టిట్యూట్‌కు భారీగా నిధులు కేటాయించారు. రూరల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైనె్సస్(సైఫాయి)కు 357 కోట్లు, రాజధాని లక్నోలోని కేన్సర్ సెంటర్ విస్తరణకు 248 కోట్లు వెచ్చించారు. సమగ్ర శిక్షణా పథకం కింద ప్రాథమిక విద్యా రంగానికి 18,485 కోట్ల రూపాయలు బడ్జెట్‌లో ప్రతిపాదించారు. మధ్యాహ్న భోజన పథకానికి 2,275 కోట్లు, ప్రాథమిక పాఠశాలల్లో వౌలిక సదుపాయాల కల్పనకు రూ. 500 కోట్లు కేటాయించారు. 1 నుంచి ఐదో తరగతి విద్యార్థులకు ఒక జత బూట్లు, సాక్స్‌లు, ఒక స్వెట్టర్ ఉచితంగా ఇవ్వాలని యోగి ప్రభుత్వం నిర్ణయించింది. గురువారం నాటి బడ్జెట్‌లో దీనికి రూ. 300 కోట్ల రూపాయలు కేటాయించారు. ప్రాథమిక, మాధ్యమిక పాఠశాల విద్యార్థులకు ఉచితంగా యూనీఫామ్‌లు, అలాగే స్కూల్ బ్యాగులు ఉచితంగా ఇవ్వడానికి బడ్జెట్‌లో కేటాయింపులు జరిగాయి.
అయోధ్యను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడానికి బడ్జెట్‌లో భారీగా నిధులు కేటాయించారు. రూ. 200 కోట్లతో విమానాశ్రయం ఏర్పాటు, రూ. 101 కోట్లతో నగరాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతారు. ప్రముఖ పుణ్యక్షేత్రాల సుందరీకరణకు యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం కార్యచరణ రూపొందించింది. అయోధ్య, వారణాసి, మధుర, అలహాబాద్‌కు భారీగా కేటాయింపులు జరిగాయి. ఆర్థిక మంత్రి రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ శ్రీకాశీ విశ్వనాథ్ స్పెషల్ ఏరియా డెవలప్‌మెంట్ బోర్డు కింద చేపట్టిన కార్యక్రమాలు వెల్లడించారు. వారణాసిలో విశ్వనాథుని ఆలయం విస్తరణ పనులు, గంగా నది వద్ద నుంచి రహదారి నిర్మాణానికి 270 కోట్ల రూపాయలు కేటాయించారు.
నమ్మక ద్రోహం: అఖిలేష్
యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసం చేసిందని సమాజ్‌వాదీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ దుయ్యబట్టారు. అభివృద్ధికి సరైన కేటాయింపులు లేవని ఆయన ఆరోపించారు. సన్యాసి ముఖ్యమంత్రిగా ఉంటే ప్రజల సమస్యలు ఏం తెలుస్తాయని ఆయన తీవ్ర విమర్శ చేశారు. రైతులు, వ్యాపారులు, యువకులను దగా చేశారని ఆయన అన్నారు. వైద్యం, విద్య, ఉపాధి రంగాలను పట్టించుకోలేదని ఆయన ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం అన్ని రంగాలనూ నిర్లక్ష్యం చేసిందని ఆయన అన్నారు.
చిత్రం..ఉత్తరప్రదేశ్ అసెంబ్లీలో గురువారం బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి రాజేష్ అగర్వాల్