జాతీయ వార్తలు

అధికారంలోకి వస్తే నిజమైన జీఎస్‌టీని తెస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వల్సద్, ఫిబ్రవరి 14: రానున్న లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చిన్న వ్యాపారులపై మోపిన ‘గబ్బర్ సింగ్ టాక్స్’ను తొలగించి, నిజమయిన వస్తు, సేవల పన్ను (జీఎస్‌టీ)ను తీసుకొస్తుందని ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ గురువారం ఇక్కడ నిర్వహించిన ‘జన్ ఆక్రోశ్’ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ ‘కాంగ్రెస్ పార్టీ 2019 లోక్‌సభ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే మేము నిజమయిన జీఎస్‌టీని తీసుకొస్తాం. బీజేపీ ప్రభుత్వం ‘గబ్బర్ సింగ్’ టాక్స్ (జీఎస్‌టీ)ను తీసుకొచ్చి గుజరాత్ సహా దేశవ్యాప్తంగా ఉన్న చిన్న వ్యాపారులను దోచుకుంది’ అని ఆయన అన్నారు. 2017లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి నేతృత్వం వహించిన రాహుల్ గాంధీ సుమారు ఏడాది తరువాత రాష్ట్రా న్ని సందర్శించారు. గుజరాత్‌లో రైతులు, గిరిజనులు నిర్లక్ష్యానికి గురయ్యారని ఆయన విమర్శించారు. ‘కాంగ్రెస్ పార్టీ రైతులు, గిరిజనుల సమస్యలను పరిష్కరించే విధంగా చేసిన భూసేకరణ బిల్లును మోదీ ప్రభుత్వం పార్లమెంటులోకి తీసుకు రావడం లేదు. వారి భారత్‌మాల ప్రాజెక్టు వాస్తవానికి భారత్‌మారా ప్రాజెక్టు. అది భారత్‌ను చంపేస్తోంది’ అని రాహుల్ గాంధీ అన్నారు. ‘సేకరించిన అయిదేళ్ల లోపు భూమిని ఉపయోగించక పోతే, దానిని వెనక్కి తిరిగి ఇవ్వా లి. మేము చత్తీస్‌గఢ్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తరువాత ఇలాంటి వేలాది ఎకరాల భూమి ని రైతులు, ఆదివాసీలకు తిరిగి ఇచ్చివేశాం. ఇదీ చట్టం’ అని రాహుల్ అన్నారు. ‘కాంగ్రెస్ పార్టీ మధ్యప్రదేశ్, రాజస్థాన్, చత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చిన పది రోజుల్లోగా రైతుల రుణాలను రద్దు చేసింది’ అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు.