జాతీయ వార్తలు

ఇక చూస్కోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ‘్భరత ప్రజల రక్తం ఉడికిపోతోంది. పాకిస్తాన్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు’ అంటూ భారత ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. 40మంది జవాన్లను బలిగొన్న పుల్వామా పైశాచిక ఉగ్రదాడికి ప్రతీకారం తీర్చుకునే స్వేచ్ఛను భద్రతా దళాలకు ఇస్తున్నామంటూ సంచలన ప్రకటన చేశారు. ‘ఎప్పుడు, ఎక్కడ, ఎలా, ఏ సమయంలో దాడి చేయాలో నిర్ణయించుకునే స్వేచ్ఛ మీదే’నని సైన్యానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పుల్వామా ఉగ్రదాడి వెనుక ఉన్న శక్తుల్ని కఠినంగా శిక్షించి తీరుతామని ప్రతిజ్ఞ చేశారు. దాడి చేసిన ఉగ్రవాదులు, వారి వెనుక ఉన్న శక్తులు తప్పు చేశాయని, అందుకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని ఉద్ఘాటించారు.
సీఆర్‌పీఎఫ్ జవాన్లపై దాడి చేసినందుకు భారీ మూల్యం చెల్లించక తప్పదని ఉగ్రవాదుల్ని, వారిని పెంచి పోషిస్తున్న వారిని మోదీ హెచ్చరించారు. ఈ దాడికి పాల్పడడం ద్వారా అతి పెద్ద తప్పు చేశారని, అందుకు తగిన రీతిలో సమాధానం చెప్తామని స్పష్టం చేశారు. దేశ రాజధాని న్యూఢిల్లీలో శుక్రవారం ఆధునిక ‘వందేమాతరం ఎక్స్‌ప్రెస్’ రైలును జెండా ఊపి ప్రారంభించిన అనంతరం మోదీ మాట్లాడుతూ, సీఆర్‌పీఎఫ్ జవాన్లపై జరిగిన దాడికి ప్రతీకారం తీర్చుకోవాలని ప్రజలు కోరడం అత్యంత సహజమని వ్యాఖ్యానించారు. అందుకే, ఉగ్రవాదులను ఎదుర్కోవడంలో భద్రతా దళాలకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నట్టు మోదీ ప్రకటించారు. దాడి వెనక ఉన్న శక్తులు, నిందితులకు శిక్ష తప్పకుండా పడుతుందనే హామీ ఇస్తున్నానని మోదీ తెలిపారు. ‘మన సైనికుల ధైర్యం, సామర్థ్యం, వీరత్వంపై నాకు పూర్తి విశ్వాసం ఉంది. దేశ భక్తి కలిగిన వ్యక్తులు ఉగ్రవాదులకు సంబంధించిన సరైన సమాచారాన్ని మన ఏజెన్సీలకు చేరవేస్తారని నమ్ముతున్నాను’ అని ప్రధాని అన్నారు. ఉగ్రవాదాన్ని అణచివేసేందుకు భారత్ చేస్తున్న పోరాటం మరింత వేగవంతమవుతుందని ఆయన తెలిపారు. ఉగ్రవాదులు, వారి పోషకులు పెద్ద తప్పు చేశారు, వారు చాలా భారీ మూల్యం చెల్లించకతప్పదని, జైషె మహమ్మద్ సంస్థను, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్‌ను ఆయన పరోక్షంగా హెచ్చరించారు. ఈ దాడిపై దేశ ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, వారి రక్తం మరుగుతోందనేది తాను అర్థం చేసుకోగలనని మోదీ చెప్పారు. భారత దేశాన్ని అస్థిరం చేయగలమని పొరుగుదేశం భావిస్తే, అది వారు చేసే పెద్ద తప్పవుతుందని వ్యాఖ్యానించారు. భారత దేశం ఎన్నడూ అస్థిరతకు గురి కాదని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదుల దాడి మూలంగా నెలకొన్న పరిస్థితులను ఎదుర్కొనేందుకు అన్ని రాజకీయ పార్టీలు సమైక్యంగా వ్యవహరించాలని, రాజకీయాలకు అతీతంగా పని చేయాలని ప్రధాన మంత్రి సూచించారు. దాడి సంఘటనపై ఎలాంటి రాజకీయం జరగకూడదని అన్నారు. అధికార, ప్రతిపక్షాలు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని కోరారు. దేశం సమైక్యంగా ఉండటంతోపాటు మనమంతా ఐకమత్యంగా ఉండడం ద్వారా శత్రువును ఓడించాలని మోదీ పిలుపు ఇచ్చారు. అన్ని దేశాలు సమైక్యంగా కృషిచేస్తే ఉగ్రవాదం ఎక్కువ కాలం కొనసాగలేదని ఆయన అభిప్రాయపడ్డారు. అత్యంత తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న మన పొరుగు దేశం ఉగ్ర దాడుల ద్వారా భారత దేశాన్ని కూడా అలాంటి పరిస్థితిలోకి నెట్టాలని చూస్తున్నదని, కానీ అది వారి పొరపాటే అవుతుందని చెప్పారు. పొరుగు దేశం అనుసరిస్తున్న విధానాలు వారు విధ్వంసం, వినాశనానికి దారి తీస్తాయని స్పష్టం చేశారు. మనం ఎంచుకున్నది అభివృద్ధి దారి అని చెప్పారు. 130 కోట్ల మంది భారతీయులు ఒకటిగా నిలిచి, ప్రతి కుట్రకు, ప్రతి దాడికి దీటైన సమాధానం ఇస్తారన్నారు. పెద్ద దేశాలు సైతం పుల్వామా దాడిని ఖండించటంతోపాటు భారత దేశానికి మద్దతు ప్రకటించటం మరిచిపోరాదన్నారు. అన్ని దేశాలు ముక్తకంఠంతో ఉగ్రవాదాన్ని ఖండించాలని, ఏకాభిప్రాయంతో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా పోరాడాలని పిలుపునిచ్చారు. ఆ విధంగా చేసినప్పుడు ఉగ్రవాదానికి తెరపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

పాక్‌కు డిమార్ష్
పుల్వామా దాడి నేపథ్యంలో పాక్‌ను ఏకాకిని చేసే దౌత్య ప్రయత్నాలను భారత్ ముమ్మరం చేసింది. పాక్‌కు డిమార్ష్ జారీ చేయడంతో పాటు అమెరికా, రష్యా, ప్రాన్స్, యూకే సహా మొత్తం 25 దేశాల దౌత్యవేత్తలకు పాకిస్తాన్ ఉగ్ర నైజాన్ని వివరించింది. జైషే మొహమ్మద్‌పై తక్షణమే చర్యలు తీసుకోవాలని, తమ భూభాగాన్ని ఉగ్రవాద చర్యలకు ఉపయోగించుకోకుండా నిరోధక చర్యలు తీసుకోవాలని ఆ డిమార్ష్‌లో పాక్‌కు స్పష్టం చేసింది. పాకిస్తాన్‌లో భారత హైకమిషనర్ అజయ్ బిసారియాను పిలిపించి తాజా దాడిపై సంప్రదింపులు జరిపింది. అలాగే దేశంలోలని పాకిస్తాన్ రాయబారి సొహేల్ మహ్‌మూద్‌ను పిలిపించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్ర పదజాలంతో డిమార్ష్ జారీ చేసింది. పుల్వామా దాడితో తమకు సంబంధం లేదంటూ పాకిస్తాన్ చేసిన ప్రకటనను తిరస్కరించింది.