జాతీయ వార్తలు

ఉపరాష్టప్రతి ప్రసంగాల పుస్తకావిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపేందుకు ప్రపంచదేశాలు ముందుకు రావాలని ఉపరాష్టప్రతి వెంకయ్య నాయుడు పిలుపునిచ్చారు. వెంకయ్య నాయుడు గత సంవత్సర కాలంలో చేసిన ప్రసంగాల సంకలనం ‘సెలెక్టెడ్ స్పీచేస్ వాల్యూమ్-వన్’ పుస్తకాన్ని ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రులు తావర్‌చంద్ గెహ్లాట్, రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. సీఆర్‌పీఎఫ్ జవాన్ల మృతికి ఈ కార్యక్రమంలో రెండు నిమిషాల పాటుగా వౌనం పాటించారు. అనంతరం, వెంకయ్య నాయుడు మాట్లాడుతూ పుల్వామా జిల్లాలో భత్రతా బలగాలను లక్ష్యంగా చేసుకొని దాడికి పాల్పడడాన్ని తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో వీరమరణం పొందిన వారి కుటుంబాలకు దేశం యావత్తు మద్దతుగా నిలుస్తుందన్నారు. ఎప్పటి నుంచో మన దేశాన్ని ఇబ్బందులకు గురి చేసేందుకు పాకిస్తాన్ అన్ని విధాలుగా ఉగ్ర సంస్థలకు శిక్షణ, వనరులు అందిస్తుందని ఆరోపించారు. టెర్రరిజానికి మతం అనేది ఉండదని, అది మానవత్వానికి వ్యతిరేకంగా పని చేస్తుందని మండిపడ్డారు. ఉగ్రవాదం మనుగడ సాగించేందుకు వీలులేకుండా అణచివేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇందు కోసం ఐక్యరాజ్యసమితి సమగ్ర కనె్వన్షన్ వెంటనే చట్టాన్ని తీసుకురావాలని ఆయన కోరారు. తన పుస్తకాన్ని ఆవిష్కరించేందుకు వచ్చిన భారత రత్న, మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీకి ఆయన ధన్యవాదాలు తెలిపారు.
గతంలో ప్రతిరోజు అన్ని విధాలుగా ప్రజలను కలిసేందుకు అవకాశం ఉండేదని, కానీ, ఇప్పుడు ఉపరాష్టగ్రా ఎంపికైన తర్వాత ప్రోటోకాల్ నిబంధనల వల్ల నేరుగా ప్రజలను కలిసేందుకు ఇబ్బందులు ఎదురౌతున్నాయని వెంకయ్య నాయుడు వెల్లడించారు. అయితే, ఇప్పుడు విద్యార్థులు, శాస్తవ్రేత్తలు, వ్యవసాయ రంగ నిపుణులు, పారిశ్రామిక వేత్తలు, వివిధ సంస్థలు, సంఘాలకు చెందిన ప్రతినిధులను కలిసేందుకు తనకు మంచి అవకాశం లభించిందని పేర్కొన్నారు. మన దేశం పూర్వకాలంలో ప్రపంచ దేశాలకు విశ్వగురువుగా విజ్ఞాన కేంద్రంగా నిలిచిందని పేర్కొన్నారు. పూర్వకాలంలో మన దేశం చరిత్రకు, వేదాలకు, అపార మేధోసంపత్తికి, వైద్యానికి, ఇంకా అనేక రంగాలకు ప్రఖ్యాతి గాంచిందని, అన్ని రకాలుగా ప్రపంచంలోనే అగ్రగామిగా నిలిచిందని ఉపరాష్టప్రతి అన్నారు. ఇటీవల ముగిసిన మధ్యంతర బడ్జెట్ సమావేశాలలో ప్రజా సమస్యలపై, రాష్టప్రతి ప్రసంగ తీర్మానంపై చర్చ జరగకపోవడంపై ఆయన అసంతృప్తిని వ్యక్తం చేశారు. రాజ్యసభలో వారం రోజుల పాటు ఎటువంటి కార్యకలపాలు జరగకుండానే సమవేశాలు ముగియడం సరికాదని పేర్కొన్నారు. ప్రజా సమస్యలపై చట్ట సభలలో చర్చలకు ప్రజాప్రతినిధులు ప్రధాన్యం ఇవ్వాలని సూచించారు. పెడింగ్ కేసులను పరిష్కరించి సత్వర న్యాయ అందించే విధంగా మన న్యాయ వ్యవస్థ మేరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియాదే కీలక పాత్ర అంటూ, కానీ ఇటీవల కాలంలో వివాదాస్పద అంశాలకే ఎక్కువ ప్రాధాన్య ఇస్తున్నదని ఆభిప్రాయ పడ్డారు. చట్ట సభలను అడ్డుకుంటేనో, సభలో వివాదాస్పద వ్యాఖ్యాలు చేస్తేనో మీడియా ప్రాధాన్యం ఇస్తోందని, అది స్వాగతించాల్సిన విషయం కాదని స్పష్టం చేశారు. ప్రజా సమస్యలపై చట్ట సభలలో జరిగే చర్చలకు మీడియా ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. దేశంలో అభివృద్ధి ఫలాలు అందరికీ అందలని వెంకయ్య పేర్కొన్నారు.
మాజీ రాష్టప్రతి ప్రణబ్ ముఖర్జీ మాట్లాడుతూ జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రదాడి ద్వారా మన భద్రతా దళాల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని పరోక్షంగా పాకిస్తాన్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ముష్కరుల దాడిని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖడించాలని కోరారు. వెంకయ్య నాయుడు ప్రసంగాలకు తాను అభిమానిననీ, వారి ప్రసంగాల్లో భారతీయ సంస్కృతి, నీతి, రాజ్యాంగ విలువలు ప్రతిబింబిస్తాయని ప్రణబ్ ప్రశంసించారు.