జాతీయ వార్తలు

మొక్కవోని దీక్ష, స్ఫూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, మార్చి 29: బ్రసెల్స్ బాంబు దాడుల నేపథ్యంలో బెల్జియం ప్రజలు ప్రదర్శించిన దృఢసంకల్పం, స్ఫూర్తిని ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసిస్తూ, భారత దేశం వారితో భుజం, భుజం కలిపి నిలుస్తుందన్నారు. మూడు దేశాల పర్యటనలో భాగంగా మోదీ మంగళవారం రాత్రి బెల్జియంకు బయలు దేరారు. ఆయన అక్కడినుంచి మార్చి 31, ఏప్రిల్ 1 తేదీల్లో అణు భద్రతపై జరిగే అంతర్జాతీయ సదస్సులో పాల్గొనడానికి వాషింగ్టన్ వెళ్తారు. ఆ తర్వాత సౌదీ అరేబియాలో రెండు రోజుల పర్యటనకోసం వెళ్తారు. బ్రసెల్స్‌లో మోదీ భారత్-ఇయు శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. వివిధ రంగాలపై బహుముఖమైన చర్చ జరపడానికి ఈ సదస్సు అవకాశం కల్పిస్తుందని, 28 దేశాలు సభ్యులుగా ఉన్న ఐరోపా సమాజం భారత్‌కు ముఖ్యమైన వ్యాపార భాగస్వామి అని బ్రెజిల్ వెళ్లడానికి ముందు విడుదల చేసిన ఒక ప్రకటనలో మోదీ అన్నారు. సౌదీ అరేబియాతో భారత దేశ సంబంధాలు ప్రత్యేకమైనవని, ద్వైపాక్షిక చర్చల్లో ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలు ప్రధానాంశంగా ఉంటాయని అన్నారు. ద్వైపాక్షిక సంబంధాలను మరింత విస్తరించుకోవడానికి, బలోపేతం చేసుకోవడానికి సౌదీ ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని అనుకుంటున్నట్లు ఆయన చెప్పారు. బ్రెజిల్ రాజధాని బ్రసెల్స్ బాంబు దాడులతో దద్దరిల్లిన వారం రోజులకే మోదీ అక్కడికి వెళ్తుండడం గమనార్హం. ఈ బాంబు పేలుళ్లలో ఒక భారతీయుడు సహా 35 మంది మరణించగా, 300కు పైగా గాయపడిన విషయం తెలిసిందే. ‘బెల్జియం ప్రజల ఆత్మస్థైర్యం, స్ఫూర్తిని ప్రశంసించడానికి మాటలు చాలవు. ఈ దాడుల దృష్ట్యా మేము వారికి పూర్తి అండగా నిలవడమే కాక పేలుళ్లలో తమ ప్రియతములను కోల్పోయిన వారి బాధలో పాలుపంచుకుంటున్నాము’ అని మోదీ అన్నారు. బ్రసెల్స్‌లో మోదీ భారత్-ఇయు శిఖరాగ్ర సదస్సులో పాల్గొనడంతోపాటు బుధవారం బెల్జియం ప్రధాని చార్లెస్ మిచెల్‌తో శిఖరాగ్ర చర్చలు జరుపుతారు. బ్రసెల్స్‌లో యూరోపియన్ పార్లమెంటు సభ్యులతోను, బెల్జియం సిఈఓలతోపాటుగా వివిధ రంగాలకు చెందిన ప్రవాస భారతీయులను తాను కలుసుకోనున్నట్లు మోదీ తెలిపారు. బ్రసెల్స్‌లోని డైమండ్ వ్యాపారుల అసోసియేషన్ బోర్డు సభ్యులతోను ఆయన మాట్లాడతారు. అలాగే నగరంలోని భారతీయ సంతతివారు ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో కూడా మోదీ పాల్గొంటారు.