జాతీయ వార్తలు

రగులుతున్న భారతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: కాశ్మీర్‌లోని పుల్వామాలో పాక్ మిలిటెంట్లు జరిపిన మారణకాండపై యావద్భారతం రగిలిపోయింది. పాక్ పని పట్టాల్సిందేనని, దానికి తగిన రీతిలో బుద్ధి చెప్పాల్సిందేనంటూ నిరసన జ్వాలలు వెల్లువెత్తాయి. అనేక రాష్ట్రాల్లో పాక్ జాతీయ పతాకాలను ఆందోళనకారులు దగ్ధం చేశారు. కాశ్మీర్‌లో అయితే, ఈ నిరసనలు తారస్థాయికి చేరుకున్నాయి. వాహనాలను ధ్వంసం చేయడంతోపాటు వాటిని తగలబెట్టడం ద్వారా కాశ్మీరీ యువత పాక్ పట్ల తమ ఆగ్రహాన్ని చాటుకుంది. అలాగే దేశ సేవ కోసం సైన్యంలో చేరిన తమ బిడ్డలు ఇలా ఉగ్రవాద ముష్కరుల దాడికి బలికావడం ఆయా కుటుంబాల్లో తీరని వేదన, ఆవేదనను మిగిల్చింది. పట్టరాని దుఖంతో బాధిత కుటుంబాలు రోదిస్తున్నాయి. వీరి బాధను ఆపడం, ఆవేదనను చల్లార్చడం ఎవరితరమూ కావడంలేదు. పాకిస్తాన్‌ను వదిలిపెట్టడానికి వీల్లేదంటూ అంత ఆవేదనలోనూ ఈ కుటుంబాలు చాటిచెప్పాయి. పాక్ మిలిటెంట్ల దాడుల్లో అసువులు బాసిన వీర జవాన్ల మృతదేహాల కోసం ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఆయా కుటుంబాలు ఎదురుచూస్తూనే మరోపక్క పాక్ వ్యతిరేక నినాదాలతో నిరసనను వ్యక్తం చేస్తున్నాయి. సైనికులపై దాడులకు తెగబడిన జైషే-ఇ-మహమ్మద్ చీఫ్ మసూద్ అజార్ దిష్టిబొమ్మలను వారణాసిలో తగులబెట్టడం ద్వారా ప్రజలు ఆందోళనలకు దిగారు. ఉగ్రవాదుల దాడులు ఇంకెంతకాలం కొనసాగిస్తారు? దీనికి అంతులేదా? అంటూ పలువురు ఆందోళనకారులు వారణాసి వీధుల్లో ప్లకార్డులతో నిరసనకు దిగారు. భోపాల్‌లో బీజేపీ కార్యకర్తల నేతృత్వంలో పలువురు ఆందోళనకారులు ఉగ్రదాడిని తీవ్రంగా ఖండిస్తూ, వీర జవాన్ల మృతికి సంతాపం తెలిపారు. పాక్ తీవ్రవాదుల దాడి అత్యంత బాధాకరం, విచారకరమైన ఘటన అని, ఇలాంటి సందర్భాల్లో ప్రధాని నరేంద్ర మోదీ జోక్యం చేసుకుని పాక్ ఉగ్రవాదులకు తగిన గుణపాఠం చెప్పాలని ఆందోళనకారుల్లో ఒకరు ఎలుగెత్తారు. సీఆర్‌పీఎఫ్ జవాన్ల మృతికి జమ్మూ-కాశ్మీర్‌లో పలువురు యువకులు ఆందోళన వ్యక్తం చేశారు. 40 మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నవారి చర్యలు అత్యంత హేయనీమని అంటూ ఇందుకు బాధ్యులైనవారిని తుదముట్టించేందుకు కఠిన వైఖరిని కనబరచాలని, మరో సర్జికల్ స్ట్రయిక్ అవసరాన్ని జమ్మూ-కాశ్మీర్ యువత నొక్కిచెప్పారు. యువకులు, స్థానికులు పెద్ద ఎత్తున ఒకచోటచేరి పాక్ వ్యతిరేక నినాదాలు చేశారు. పొరుగు దేశమైన పాక్ తీవ్రవాత వ్యతిరేకులకు మద్దతు ఇవ్వవద్దని, భారత్‌పై దాడులు జరుగకుండా వారిని నిరోధించాలని పలువురు నిరసనకారులు నినాదాలు చేశారు. పాక్ ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన ఒక సీఆర్‌పీఎఫ్ జవాన్ రమేష్ యాదవ్ తండ్రి మాట్లాడుతూ భీకరమైన ఉగ్ర ఘటనపై ప్రభుత్వం తక్షణం విచారణకు ఆదేశించాలని, పాక్‌కు తగిన బుద్ధి చెప్పాలని డిమాండ్ చేశారు. ‘25 రోజుల కిందటే మా కొడుకు ఇంటికి వచ్చాడు. అయితే, గురువారం సాయంత్రం శ్రీగర్ నుంచి ఒక ఫోన్ వచ్చింది. ఉగ్రదాడిలో తమ కుమారుడు మరణించాడని సంబంధిత అధికారి చెప్పడడంతో హతాశులమయ్యాం. ఇపుడు మా కొడుకు మృతదేహం కోసం ఎదురుచూస్తున్నాం’ అని వీర సైనికుడి తండ్రి బాధాతప్త హృదయంతో అన్నారు. పాక్ తీవ్రవాదుల దాడిలో తమ కుమారుడితోపాటు ఎంతోమంది సైనికులు అసువులు బాశారని అంటూ తమ కుటుంబానికి తమ కుమారుడే పెద్ద దిక్కని, అలాంటి అకాల మరణం చెందడంతో చదువుతున్న అతని కుమారుడు కూడా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఎదురయ్యాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. బీహార్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్ జవాను రతన్ ఠాకూర్ తండ్రి సైతం ఇక్కడ జరిగిన ఒక నిరసన కార్యక్రమంలో మాట్లాడుతూ ఉగ్రదాడికి తెగబడిన పాకిస్తాన్‌కు తగిన సమాధానం చెప్పాలని ప్రభుత్వాన్ని కోరారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన తమ కుమారుడు అసువులు బాశాడని, అయితే, తన రెండో కుమారుడిని సైతం దేశం కోసం పోరాడేందుకు సైన్యంలోకి పంపిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశాడు. అయితే, పాకిస్తాన్‌కు తగిన బుద్ధి చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.