జాతీయ వార్తలు

రాజకీయాలకతీతంగా దాడిని ఖండించాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: దేశ రక్షణ, భద్రత విషయంలో భద్రతా బలగాలకు యావత్ భారతదేశం అండగా ఉంటుందని తెలుగుదేశం లోక్‌సభ సభ్యుడు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. పుల్వామా ఉగ్రదాడి అనంతర పరిస్థితులపై కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ అధ్యక్షతన శనివారం పార్లమెంట్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలుగుదేశం పార్టీ తరఫున రామ్మోహన్ పాల్గొన్నారు. అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ- రాజకీయాలకు అతీతంగా ఉగ్రదాడిని ఖండించామని చెప్పారు. సైనికుల ప్రాణత్యాగాలను గౌరవించాలని, దేశమంతా భద్రతా బలగాలకు అండగా ఉండాలని అన్ని పార్టీలూ స్పష్టం చేశాయని తెలిపారు. ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని అన్ని పార్టీలు హోం మంత్రికి సూచించినట్టు చెప్పారు. కశ్మీర్‌లో సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని రాజ్‌నాథ్ సింగ్ చెప్పారని అన్నారు. ఉగ్రదాడిలో ప్రాణాలు కొల్పోయిన కుటుంబాలను అన్ని విధాలుగా అదుకోవాలని కేంద్రానికి సూచించినట్టు తెలిపారు. పుల్వామా దాడి వివరాలను రాజ్‌నాథ్ సింగ్ , సీఆర్‌పీఎఫ్ ఉన్నత అధికారులు ఈ సమావేశంలో వివరించినట్టు రామ్మోహన్ నాయుడు చెప్పారు.