జాతీయ వార్తలు

స్టార్టింగ్ ట్రబుల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 16: ప్రధాని నరేంద్రమోదీ లాంఛనంగా ప్రారంభించిన ప్రతిష్టాకరమైన వందే భారత్ ఎక్స్‌ప్రెస్ శనివారం సాంకేతిక లోపాలతో ఆలస్యంగా ఢిల్లీకి చేరుకుంది. స్వదేశీ పరిజ్ఞానంతో ఈ కోచ్‌లను తయారు చేశారు. ఈ రైలు గంటకు 180కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ఈ రైలు సాంకేతిక కారణాల వల్ల చివరకు శనివారం మధ్యాహ్నం 1 గంటకు ఢిల్లీకి చేరుకుంది. వాస్తవానికి ఈ రైలు కమర్షియల్ ఆపరేషన్స్ ఈ నెల 17వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభమవుతాయి. శనివారం ట్రయల్ రన్ ప్రాతిపదికన నడిపారు. ఆదివారం నుంచి ఈ రైలులో ప్రయాణం చేసేందుకు టిక్కెట్లు ఇస్తారు. ఇంజన్ రహిత రైలుగా పిలిచే ఈ రైలు పశువులు అడ్డురావడం, బ్రేక్స్‌లలో సాంకేతికపరమైన లోపాలు తలెత్తడంతో ఈ రైలుకు కష్టాలు ప్రారంభమయ్యాయి. ఈ రైలు శుక్రవారం ఢిల్లీ నుంచి వారణాసికి అనుకున్నట్లుగా నిర్దేశించిన సమయానికి చేరుకుంది. ఆ తర్వాత తిరుగు ప్రయాణం శుక్రవారం రాత్రి 10.30 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 6.30 గంటలకు తుండ్లా జంక్షన్‌లో సాంకేతిక సమస్యలు తలెత్తి రైలు నిలిచిపోయినట్లు నార్తరన్ రైల్వే సీపీఆర్‌వో దీపక్ కుమార్ చెప్పారు.
ఈ రైలులో అనేక మంది జర్నలిస్టులు కూడా ప్రయాణం చేస్తున్నారు. తుండ్లా రైల్వే స్టేషన్ వద్ద గంట సేపు నిలిచిపోయింది. చివరి నాలుగు కోచ్‌లలో పొగ వచ్చింది. కరెంటు కూడా లేదు. అనంతరం ఈ రైలుకు మరమ్మత్తులు చేశారు. ఉదయం 8.15 గంటలకు బయలుదేరింది. పది కి.మీ వేగం నుంచి 40 కి.మీ వేగానికి ఈ రైలు ను తీసుకెళుతూ చివరకు వంద కి.మీ వేగానికి పెంచారు. రాత్రి 10. 30 గంటలకు వారణాసిలో బయలుదేరిన ఈ రైలు శనివారం మధ్యాహ్నం 1 గంటకు ఢిల్లీకి చేరుకుంది. మోదీ పరిపాలన మాదిరిగానే ఈ రైలు ప్రయాణం ఉందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ట్వీట్‌లో ఎద్దేవా చేశారు. ఈ రైలును చెన్నై ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీలో తయారు చేశా రు.

చిత్రం.. వందే భారత్ రైలు