జాతీయ వార్తలు

రైతుకు రిక్తహస్తమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జగదల్‌పూర్ (చత్తీస్‌గఢ్): కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం బడాపారిశ్రామికవేత్తలకు చెందిన రూ.3.5 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేసి, రైతులకేమో రోజుకు రూ.3.50 పైసల చొప్పున వ్యవసాయ రంగంలో ఆర్థిక సాయం చేయడం పెద్ద దగా అని ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ విమర్శించారు. కోట్లకు పడగలెత్తిన అనిల్ అంబా నీ, విజయ్ మాల్యా పట్ల మోదీ ప్రభుత్వం ప్రజల సొమ్మును దోచిపెడుతోందన్నారు. శనివారం ఇక్కడ దుర్గాన్ గ్రామంలో జరిగిన గిరిజనుల భారీ ర్యాలీలో ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి స్కీం రైతుల పాలిట కంటితుడుపు చర్య అన్నారు. రైతులకు సాలీనా మూడు విడతలు కింద రూ.6వేల సొమ్ము ను జమచేయడం దారుణమన్నా రు. ఈ సొమ్ము ఏ మూలకు సరిపోతుందన్నారు. రైతులకు ఆర్థిక సాయం ఒక జోక్ అన్నా రు. ఈ మాత్రం సాయానికి బీజేపీ సభ్యు లు లోక్‌సభలో బల్లలను పెద్ద ఎత్తున చరిచారన్నారు. తమ ప్రభు త్వం అధికారంలోకి వస్తే కనీస ఆదాయం గ్యారంటీ స్కీంను అమలు చేస్తామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి పేదవాడి బ్యాంకు ఖాతాలో రూ.15 లక్షల సొమ్మును జమ చేస్తామన్న హామీని ఏమీ చేశారని బీజేపీని నిలదీశారు. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం అభాసుపాలైందని, పేదలు నానా అగచాట్లు పడ్డారన్నారు. అనిల్ అంబానీ, మెహుల్ చోక్సీ, నీరవ్ మోదీ, విజయ్ మాల్యాలు ఏటీఎంల వద్ద నగదు డ్రా కోసం క్యూలో నిల్చున్నారా అని అడిగారు. నల్లధనం నిర్మూలన బోగస్ కార్యక్రమంలా తయారైందన్నారు. ప్రజల సొమ్మును తస్కరించి బడాపారిశ్రామికవేత్తలకు పెద్ద మొత్తంలో రుణాలు ఇచ్చారని, వారి బకాయిలను రద్దుచేశారని విమర్శించారు. గబ్బర్ సింగ్ ట్యాక్స్‌గా జీఎస్‌టీ అవతరించిందన్నారు. దేశంలో రూ.12 లక్షల కోట్ల మేర బడా పారిశ్రామికవేత్తలు బ్యాంకులకు బకాయి ఉన్నారని, ఈ సొమ్మును కూడా మోదీ మాఫీ చేస్తారన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు రాష్ట్రాల్లో ఆరు గంటల్లో రైతులకు రుణాలను మాఫీ చేశామన్నారు. టాటా స్టీల్ సేకరించిన భూములను తిరిగి గిరిజనులకు ఇచ్చేస్తామన్నారు. వరికి కనీస మద్దతుధర రూ.2500, బీడీ ఆకులకు రూ.4000 చొప్పున చెల్లస్తామన్నారు. గతంలో రమ ణ్ సింగ్ ప్రభుత్వం గిరిజనులను మోసం చేసిందన్నారు. అడవిలోని సంపదపై గిరిజనులకే గుత్త్ధాపత్యం ఉంటుందన్నారు. పేదలు, అన్ని వర్గాలప్రజలు తమ ప్రభుత్వాన్ని ఎప్పుడైనా కలుసుకుని సమస్యలను నివేదించవచ్చన్నారు. ఈ సమావేశం ప్రారంభంలో అమరులైన 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లకు సంతాప సూచకంగా రెండు నిమిషాల సేపు ప్రజలు వౌనం పాటించారు. ఈ సందర్భంగా టాటా స్టీల్ ఫ్యాక్టరీ సేకరించిన భూములను ప్రభు త్వం స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో ఆ భూముల పట్టాలను గిరిజనులకు రాహు ల్ గాంధీ పంపిణీ చేశారు.
చిత్రం.. అమరులైన సీఆర్‌పీఎఫ్ జవాన్ల మృతికి సంతాప సూచకంగా శనివారం దుర్గాన్‌లో జరిగిన సభలో వౌనం పాటిస్తున్న రాహుల్‌గాంధీ తదితర కాంగ్రెస్ నేతలు