జాతీయ వార్తలు

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 17: క్రియాశీల రాజకీయాల్లోకి తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ అడుగుపెట్టడంపై జరుగుతున్న ఊహాగానాలకు తెరపడింది. రజనీ మక్కల్ మండ్రం పార్టీని రజనీకాంత్ స్థాపించినప్పటికీ ఇంతవరకు క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెట్టలేదు. రెండు మూడు నెలల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేస్తుందని వస్తున్న వార్తలకు ఆయన ఫుల్‌స్టాప్ పెట్టారు. త్వరలో జరగబోయే లోక్‌సభ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయదని, అలాగే ఏ పార్టీకి మద్దతు ఇవ్వదని ఆదివారం ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో చిరకాలంగా ఉన్న నీటి సమస్యకు ఏ పార్టీ అయితే శాశ్వత పరిష్కారం చూపుతుందని నమ్ముతారో దానికే ఓటు వేయాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో నేను పోటీ చేయడం లేదు.. నా లక్ష్యం అంతా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలే.. అలాగని నేను పార్లమెంట్ ఎన్నికల్లో ఏ పార్టీకి కూడా మద్దతు తెలియజేయడం లేదు.. కనుక ఏ పార్టీ వారు కూడా తమ ప్రచారంలో నా ఫొటో కాని, నా పార్టీ గుర్తు కాని వాడవద్దని కోరుతున్నా’ అని ఆయన ఒక ప్రకటనలో తెలియజేశారు. పొయిస్ గార్డెన్‌లోని తన నివాసంలో ఆదివారం ఆయన పార్టీ జిల్లా కార్యదర్శులతో సమావేశమయ్యారు. అనంతరం ఆయన వారితో గ్రూపు ఫొటో దిగారు. కాగా, గత ఏడాది డిసెంబర్‌తో 69 ఏళ్ల వయసులోకి అడుగుపెట్టిన రజనీకాంత్ 2017, డిసెంబర్ 31న తన అభిమానుల సమక్షంలో పార్టీ పెడుతున్నట్టు ప్రకటించారు. 2021లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రంలోని 234 స్థానాలకు పోటీ చేస్తానని ఆయన చెప్పారు. అయితే తర్వాత ఆయన వరుస సినిమాలు చేస్తూ బిజీగా మారడం, పార్టీ నిర్మాణం గురించి దృష్టి సారించకపోవడంతో అసలు ఆయన రాజకీయాల్లో ఉంటారా లేదా అన్న ప్రశ్నలు సైతం అభిమానుల్లో ఏర్పడ్డాయి. ఈ ఏడాది జరిగే లోక్‌సభ ఎన్నికల్లో ఆయన పార్టీ పోటీ చేస్తుందని అభిమానులు భావించారు. అయితే రజనీకాంత్ ఆదివారం చేసిన ప్రకటనతో ఆ ఊహాగానాలకు తెరపడింది.

చిత్రం.. రజనీకాంత్