జాతీయ వార్తలు

సవాళ్లకు జవాబు మోదీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రక్ (ఒడిసా), ఫిబ్రవరి 17: ప్రధాని నరేంద్ర మోదీపై గత కొన్ని రోజులుగా కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ చేస్తున్న విమర్శలను హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గట్టిగా తిప్పికొట్టారు. దేశ చౌకీదార్ చోర్ కాదని, స్వచ్ఛత, సచ్ఛీలతకు ప్రతీక అని ఆదివారం ఇక్కడ జరిగిన ఓ ర్యాలీలో అన్నారు. నిజాయితీ, సమర్థ పనితీరుకు ప్రతీక అయిన మోదీ లోక్‌సభ ఎన్నికల తర్వాత కూడా ప్రధానిగా దేశానికి సేవ చేస్తారని అన్నారు. మోదీ నిజాయితీ, ఉద్దేశాలను ఎవరూ శంకించాల్సిన అవసరం లేదని, ఈ విషయంలో రాహుల్ తన ఆలోచనను మార్చుకోవాలని రాజ్‌నాథ్ అన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పనితీరుపై రాహుల్ గాంధీ ఎలాంటి విమర్శలైనా చేయవచ్చుగానీ, నిరాధార, తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలని హితవు చెప్పారు. మోదీ మళ్లీ ప్రధాని కావడం ఖాయమని, దేశ సమస్యలన్నింటికీ ఆయనే పరిష్కారమని ఉద్ఘాటించారు. రాష్టప్రతి, ప్రధాని పదవుల గౌరవాన్ని దృష్టిలో పెట్టుకుని అన్ని రాజకీయ పార్టీలు, నేతలు వ్యవహరించాలన్నారు. కానీ రాహుల్ గాంధీకి ఇలాంటివేమీ పట్టవని, నోటికి ఏది వస్తే అది మాట్లాడుతున్నారంటూ రాజ్‌నాథ్ విరుచుకు పడ్డారు. రాఫెల్ ఒప్పందంపై దేశ ప్రజలను రాహుల్ తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించిన రాజ్‌నాథ్ ‘అవినీతికి పాల్పడాల్సిన అవసరం మోదీకి ఎంత మాత్రం లేదు. ఎలాంటి కుటుంబం లేనప్పుడు ఎవరికోసం మోదీ లంచం తీసుకుంటారు’అంటూ ఎదురుదాడికి దిగారు. ఆయనకు కుటుంబం లేదు’
ఉగ్రవాదమే పాక్ దేశభక్తి!
పాకిస్తాన్ దేశం ఉగ్రవాదాన్ని దేశభక్తిగా మారుస్తోందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆరోపించారు. ఉత్తర ఒడిసా ప్రాంతంలో ఆదివారం జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లుగా భారత జవానులు జరుపుతున్న విజయవంతమైన ఆపరేషన్లను చూసి తీవ్ర ఒత్తిడి, వ్యాకులతతో పాకిస్తాన్ మనదేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు తెగబడుతోందని విమర్శించారు. కాశ్మీర్‌లో జరిగిన ఉగ్రవాద చర్యకు తగిన గుణపాఠం చెప్పమని తమ ఆర్మీకి పూర్తి స్వేచ్ఛ ఇచ్చామని ఆయన చెప్పారు. ఆర్మీ జవానుల త్యాగాలు ఊరికే పోవని పేర్కొన్న ఆయన పాక్‌చర్యకు అన్ని రాజకీయ పార్టీలు కేంద్రానికి, భద్రతా దళాలకు మద్దతు ఇవ్వడం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. శత్రువులకు త్వరలో తగిన బుద్ధి చెప్పడం ఖాయమని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు.
చిత్రం.. ఉత్తర ఒడిసా ప్రాంతంలో ఆదివారం జరిగిన సభలో అమర జవాన్లకు నివాళులర్పిస్తున్న
కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్