జాతీయ వార్తలు

ఇక జైల్‌భరో..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాండిచ్చేరి, ఫిబ్రవరి 17: కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరిలో లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీకి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి మధ్య విభేదాలు తారా స్ధాయికి చేరాయి. ప్రజలకిచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో పేదలకు ఉచిత బియ్యం వంటి పలు సంక్షేమ పథకాలు, పాలనాపరమైన పలు అంశాలతో కూడిన ప్రతిపాదనలు తాను సమర్పిస్తే వాటిని ఆమోదించకుండా కిరణ్‌బేడీ కావాలని జాప్యం చేస్తున్నారని ముఖ్యమంత్రి వీ. నారాయణ స్వామి ఆరోపిస్తున్నారు. తన ప్రతిపాదనలకు వెంటనే అమోదముద్ర వేయాలంటూ గత నాలుగు రోజుల నుంచి ఆయన గవర్నర్ నివాస్ ఎదుట ధర్నా చేస్తున్నారు. ఆదివారం ఈ ఆందోళన ఐదవ రోజుకు చేరుకున్న సందర్భంగా నారాయణ స్వామి మాట్లాడుతూ లెఫ్టినెంట్ గవర్నర్ తన నిర్లక్ష్యాన్ని ఇలాగే కొనసాగిస్తే ఈనెల 20 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా జైల్‌భరో నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈనెల 7న తాను మొత్తం 39 ప్రతిపాదనలతో కూడిన లేఖను లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీకి పంపినప్పటికీ ఆమె ఇప్పటి వరకు వాటిని ఆమోదించలేదన్నారు. తన డిమాండ్లకు బేడీ ఆమోదముద్ర లభించే వరకు ఆందోళన విరమించేది లేదని తెగేసి చెప్పారు. కాగా లెఫినెంట్ గవర్నర్ కిరణ్‌బేడీ నారాయణ స్వామి ఆరోపణలను ఖండించారు. ‘మీరు చేస్తున్న ఆందోళలు న్యాయబద్ధం కాద’ని పేర్కొంటూ ఆమె సైతం ఓ లేఖ ముఖ్యమంత్రికి పంపారు. ‘21న ఈ విషయాలన్నింటిపై పబ్లిక్ ఫోరం ఎదుట అన్ని విషయాలపై చర్చిద్దాం’ అని కిరణ్‌బేడీ ఆ లేఖలో పేర్కొన్నారు. 2016లో కిరణ్‌బేడీ ఈ రాష్ట్ర లెఫ్టినెంట్ గవర్నర్‌గా నియమితులైన నాటి నుంచి అనేక పరిపాలనా పరమైన అంశాలపై ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతోంది. లెఫ్టినెంట్ గవర్నర్ వైఖరికి నిరసనగా ఆదివారం ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికార పార్టీతో నేతలతోపాటు సంకీర్ణ ప్రభుత్వంలోని పార్టీ నేతలంతా తమ ఇళ్లపై నల్లజెండాలను ఎగురవేసి నిరసన తెలిపారు.