జాతీయ వార్తలు

వృద్ధి పూజ్యం..ఉపాధి శూన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 17: ఉపాధి రాహిత్యం, గ్రామీణ రుణ భారం పట్టణ ప్రాంతాల్లో ప్రతికూల వాతావరణం భారత యువతను నిరాశామయ దృష్టిలోకి నెట్టేస్తున్నాయని మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అన్నారు. ఉపాధి లేని వృద్ధి పూర్తిగా ఉపాధి కోల్పోయే పరిస్థితికి దారితీసిందని, దీని ఫలితంగా యువతలో అనిశ్చితి నెలకొందని ఆయన అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించే విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, గతంలో కంటే చాలా తీవ్ర స్థాయిలోనే దేశ ఆర్థిక వ్యవస్థను అంతర్గత సవాళ్లు కుదిపేస్తున్నాయని అన్నారు. దీని ప్రభావం మొత్తం సమాజంపైనే చాలా తీవ్రంగా పడుతోందని, యువతలో నిరాశ పెరిగిపోతోందని మన్మోహన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ స్నాతకోత్సవంలో ఆదివారం మాట్లాడిన మన్మోహన్ సింగ్ ‘వ్యవసాయ సంక్షోభం తీవ్రమవుతోంది. ఉపాధి అవకాశాలు నానాటికీ అడుగంటిపోతున్నాయి. పర్యావరణ ప్రతికూలత తీవ్రమవుతోంది. వీటన్నింటికీ మించిన స్థాయిలో విచ్ఛిన్నకర శక్తులు తాండవిస్తున్నాయి’ అని అన్నారు. ప్రస్తుతం భారతదేశం ఎదుర్కొంటున్న అనేక సవాళ్లలో ఇవి కొన్ని మాత్రమేనని స్పష్టం చేసిన మన్మోహన్ సింగ్ రైతుల ఆత్మహత్యలు, తరచూ జరుగుతున్న రైతాంగ ఆందోళనలు దేశ ఆర్థిక వ్యవస్థలో సమతూక రాహిత్యానికి అద్దం పడుతున్నాయని తెలిపారు. ఈ పరిస్థితులను అధిగమించాలంటే లోతైన విశే్లషణతోపాటు సవాళ్లను అవగతం చేసుకుని, వాటిని ఎదుర్కొనే రాజకీయ చిత్తశుద్ధి అవసరమని స్పష్టం చేశారు. పారిశ్రామిక రంగంలో అదనంగా ఉపాధి అవకాశాలను కల్పించే ప్రయత్నాలు విఫలమయ్యాయని, అందుకు కారణం ఆశించిన స్థాయిలో ప్రగతి నమోదు కాకపోవడమేనని మన్మోహన్ వెల్లడించారు. ఒకప్పుడు సంపద సృష్టికి, ఉపాధి కల్పనకు ఎంతగానో దోహదం చేసిన వ్యవస్థలు పెద్దనోట్ల రద్దు కారణంగా చతికిలపడిపోయాయని మోదీ సర్కారుపై మన్మోహన్ విరుచుకుపడ్డారు. అలాగే లోతైన అవగాహన లేకుండా వ్యవస్థాగత ఏర్పాట్ల జోలికి పోకుండా జీఎస్టీ అమలు కూడా వీటిని దారుణంగా దెబ్బతీసిందని అన్నారు. దేశంలో పారిశ్రామిక, వాణిజ్య రంగాలకు మళ్లీ ఊతాన్ని ఇవ్వాలంటే ఆలోచనాత్మక విధానాలతోపాటు వాటిని సరైన రీతిలో అమలు చేయగలిగే వ్యూహాలు ఎంతో అవసరమని మన్మోహన్ పిలుపునిచ్చారు.