జాతీయ వార్తలు

కశ్మీరీలపై దాడులు సరికాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: దేశంలోని వివిధ ప్రాంతాల్లో విద్య నభ్యసిస్తున్న జమ్ముకశ్మీర్ విద్యార్థులు, ఉద్యోగులపై దాడులు చేయటం ఎంతమాత్రం మంచిది కాదు.. ఇలాంటి సంఘటనలను ఖండిస్తున్నామని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి ప్రకటించారు. సింఘ్వి సోమవారం ఏఐసీసీ కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ జమ్ముకశ్మీర్ భారతదేశంలోని భూభాగం.. పాకిస్తాన్ లేదా ఉగ్రవాద సంస్థలు, ఇతర శక్తులేవి కూడా దీనిని మననుండి వేరుచేయలేరని స్పష్టం చేశారు. కశ్మీర్‌లో ఉగ్రవాదులు చేస్తున్న దాడులను ఖండిస్తున్నాం.. దీనితోపాటు దేశంలోని వివిధ ప్రాంతాల్లో జమ్ముకశ్మీర్ విద్యార్థులపై దాడి చేసేందుకు జరుగుతున్న ప్రయత్నాలను కూడా కాంగ్రెస్ ఖండిస్తోందని ఆయన తెలిపారు. జమ్ముకశ్మీర్ విద్యార్థులపై దాడి చేస్తున్నవారు భారత పౌరులపై దాడి చేస్తున్నామన్న విషయాన్ని గ్రహించాలని ఆయన తెలిపారు. కశ్మీర్‌లో మన వీర సైనికులు చేస్తున్న త్యాగాలను ప్రశ్నించేందుకు వీలులేదు.. ఎవరైనా ఇలా చేస్తే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని సింఘ్వి డిమాండ్ చేశారు. జమ్ముకశ్మీర్ విద్యార్థులపై దాడులు చేస్తే వేర్పాటువాదులకు, ఉగ్రవాద సంస్థలకు బలం చేకూర్చినట్లేనని ఆయన స్పష్టం చేశారు. దేశంలోని ఇతర ప్రాంతాల్లో ఉంటున్న జమ్ముకశ్మీర్ విద్యార్థులను విడదీసి చూడటం మంచిది కాదని ఆయన చెప్పారు. పుల్వామా సంఘటనను రాజకీయం చేయటం మంచిది కాదని.. ఏ రాజకీయ పార్టీ కూడా ఈ సంఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోరాదని.. అలా చేసిన పక్షంలో దేశ ప్రజలు క్షమించరని సింఘ్వి స్పష్టం చేశారు. పుల్వామా సంఘటనపై జరిగిన అఖిలపక్ష సమావేశంలో జరిగిన చర్చల వివరాలు వెల్లడించేందుకు ఆయన నిరాకరించారు.

చిత్రం.. కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వి