జాతీయ వార్తలు

నేషనల్ మ్యూజియంలో నిజాం ఆభరణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: నేషనల్ మ్యూజియంలో హైదరాబాద్ నిజాం కాలంనాటి ఆభరణాల ప్రదర్శనను కేంద్ర సాంస్కృతిక వ్యవహారాల శాఖ మంత్రి మహేష్ శర్మ సోమవారం ప్రారంభించారు. నిజాం కాలంనాటి విలువైన, అరుదైన 173 నగలను ‘ఇండియా జ్యూవెలరీ-ది నిజాం జ్యూవెలరీ కలెక్షన్’ పేరుతో ప్రదర్శనను ఏర్పాటు చేశారు. అలాగే నిజాం ఆభరణాలకు సంబంధించిన బుక్లెట్‌ను కూడా విడుదల చేశారు. ఈ సందర్భంగా మహేష్ శర్మ మాట్లాడుతూ నిజాం కాలంనాటి సాంస్కృతిక వారసత్వ సంపదను ప్రజలకు, నేటి యువతకు తెలియజేసేందుకు ఈ ప్రదర్శనను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. నేటినుంచి మే 5 వరకు ఈ నగలను ప్రదర్శించనున్నారు. ఈ నగలను 1995లో రూ.218కోట్లకు భారత ప్రభుత్వం కొనుగోలు చేసింది. అప్పటినుంచి 2001 వరకు ఈ నగలు ముంబైలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో భద్రపరిచారు. అనంతరం ఈ నగలను ఢిల్లీలోని ఆర్బీఐ కార్యాలయానికి తరలించారు. ఇంతకుముందు 2001లో, 2007లో ఈ నగలను ప్రదర్శించారు.

చిత్రాలు.. న్యూఢిల్లీలోని జాతీయ మ్యూజియంలో సోమవారం ప్రారంభమైన నిజాం ఆభరణాల ప్రదర్శనలో ఆహూతులను ఆకట్టుకుంటున్న నెక్లెస్ సెట్టు, ప్రపంచంలో అతి పెద్దదైన 185 క్యారెట్ల జాకబ్ వజ్రం, అత్యంత ఖరీదైన ఇతరత్రా నగలు