జాతీయ వార్తలు

ఢిల్లీ, పాండిచ్చేరికి రాష్ట్ర హోదా ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చెన్నై, ఫిబ్రవరి 18: దేశ రాజధాని ఢిల్లీతోబాటు మరో కేంద్ర పాలిత ప్రాంతమైన పాండిచ్చేరికి రాష్ట్ర హోదాలివ్వాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సోమవారం నాడిక్కడ డిమాండ్ చేశారు. ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల ప్రజలు కేంద్రం చిన్నచూపునకు గురవకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యమంత్రి వి. నారాయణ స్వామి చేపట్టిన ఆందోళన కార్యక్రమాలకు మద్దతిచ్చేందుకు పాండిచ్చేరికి తరలివెళుతున్న కేజ్రీవాల్ మార్గమధ్యలో చెన్నైలో విలేఖరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాల పరిస్థితీ ఒకేవిధంగా ఉందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి నారాయణ స్వామి ఇచ్చిన అనేక ప్రతిపాదనలు ఆమోదానికి నోచుకోకపోవడంతో ఆయన ఈనెల 13 నుంచి లెఫ్టినెంట్ గవర్నర్ బేడీ నివాసం ‘రాజ్ నివాస్’ ఎదుట తన సహచర మంత్రులు, శాసన సభ్యులతో కలిసి ధర్నా చేస్తున్న విషయాన్ని కేజ్రీవాల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వానికి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టలేని విధంగా పాండీ లెఫ్టినెంట్ గవర్నర్ బేడీ తీవ్ర అవాంతరాలు కలుగజేస్తున్నారని, ఇదే రకమైన సమస్యలనే తానూ ఎదుర్కొంటున్నాని అన్నారు. ఈ రెండు చోట్లా ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్లు కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం నియమించిన వ్యక్తులేనని ఆయన పేర్కొన్నారు. తాను పాండిచ్చేరి సీఎం నారాయణ స్వామితో కలిసి ఈ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను పూర్తిస్ధాయి రాష్ట్రాలుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తామని కేజ్రీవాల్ తెలిపారు. కాగా ఆమ్‌ఆద్మీ పార్టీ తమిళనాడులో పోటీ చేస్తుందా? లేక మరేదైనా పార్టీలకు మద్దతునిస్తుందా అన్న ప్రశ్నలకు సమాధానమిస్తూ దానిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని కేజ్రీవాల్ బదులిచ్చారు.