జాతీయ వార్తలు

ప్రజలను మభ్యపెట్టేందుకే ‘మేకిన్ ఇండియా’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రధాన నినాదం ‘మేకిన్ ఇండియా’ కేవలం ప్రజలను మభ్యపెట్టేందుకేనని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి సోమవారం నాడిక్కడ ఆరోపించారు. వాస్తవానికి గత ఐదేళ్ల కాలంలో దేశంలో తయారీ రంగంలో పెట్టుబడులు, ఎగుమతులు గణనీయంగా తగ్గిపోయాయని అన్నారు. వారణాసిలోప్రారంభించిన భారత దేశపు తొలి సెమీ హైస్పీడ్ రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ మరుసటి రోజైన శనివారం నాడు బ్రేక్‌డౌన్ కావడంతో మేకిన్ ఇండియా కార్యక్రమంపై విపక్షాలు విమర్శల దాడిని ఆరంభించాయి. గతంలో ట్రైన్-18గా పేరున్న ఇంజన్‌లేని ఈ రైలు చెన్నైలోని ఇంటెగ్రేటెడ్ కోచ్ ఫ్యాక్టరీలో మేకిన్ ఇండియా పథకం ద్వారా తయారైంది. కాగా ఈ ఘటనపై సీతారాం ఏచూరి స్పందిస్తూ మోదీకి చెందిన ఇతర పథకాల్లాగే మేకిన్ ఇండియా కూడా ‘జుమ్లా’ (వాక్‌చాతుర్యం)గా, ప్రచార ఆర్భాటంగా మాత్రమే మిగిలాయన్నారు. దేశవ్యాప్తంగా తయారీ రంగంలో పెట్టుబడులు, ఉపాధి, ఎగుమతులు గత ఐదేళ్లలో గణనీయంగా తగ్గిపోయాయని సీతారాం ఏచూరి ట్విట్టర్‌లో విమర్శించారు. దేశ ఆర్థికాభివృద్ధి, వ్యవసాయాభివృద్ధి సైతం మోదీ ప్రభుత్వ హయాంలో బాగా తగ్గిపోయిందని, ఆరకంగా భారతీయులంతా మోదీ ప్రభుత్వంలో దిగువ స్థాయికి చేరారని ఆయన ఎద్దేవా చేశారు. రుణాలను ఏకమొత్తంలో రెండు సార్లు మాఫీ చేయడం ద్వారా తనకు సన్నిహితులైన వ్యాపారవేత్తలకు సంబంధించిన సుమారు 12 పెద్ద కంపెనీలకు మోదీ ప్రభుత్వం ప్రజాధనాన్ని దోచిపెట్టిందని ఆయన ఆరోపించారు. బ్యాంకులకు తిరిగి చెల్లించని దాదాపు రూ.3లక్షల కోట్ల రుణాలను మాఫీ చేయడం ద్వారా స్నేహితులను ప్రజాధనాన్ని ఇష్టారాజ్యంగా లూటీ చేసుకునేందుకు అనుమతించారని ఏచూరి పేర్కొన్నారు.