జాతీయ వార్తలు

చెక్కుచెదరని సాంస్కృతిక వైభవం మనది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: స్వామి వివేకానంద, రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి మహానుభావులు మనకు అందించిన సాంస్కృతిక వారసత్వ సంపద కారణంగా మనదేశం వలసవాదం, బాహ్య దాడుల నుంచి తట్టుకుని దాస్య శృంఖలాల బారిన పడకుండా రక్షించుకోగలిగామని భారత ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. సోమవారం ఇక్కడ జరిగిన ‘టాగూర్ అర్డు ఫర్ కల్చరల్ హార్మోని’ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మన మొదటి నోబెల్ బహుమతి గ్రహీత అయిన రవీంద్రనాత్ ఠాగూర్ రచనల్లో విభిన్న పార్శ్వాల వారసత్వం గురించి మనకు కళ్లకు కట్టినట్టు తెలియజేస్తాయని అన్నారు. భారత్‌కు వేలాది సంవత్సరాల చారిత్రక వారసత్వ సంపద ఉందని, దీనిని ఏ బాహ్యశక్తులు ధ్వంసం చేయలేకపోయాయని పేర్కొన్నారు. రవీంద్రనాథ్ టాగూర్, స్వామి వివేకానంద లాంటి మహానుభావులు మనగడ్డమీద పుట్టడమే దీనికి కారణమని ఆయన అన్నారు. ముఖ్యంగా రవీంద్ర సంగీత్ దేశంలోని అన్ని వర్గాల వర్ణాలను ఆవిష్కరించిందని, అది ఏ ఒక్క జాతికో, భాషకో పరిమితం కాలేదని అన్నారు. జానపద కళలు, సంప్రదాయ నృత్యాలు భారత్ సంస్కృతిలో భాగమన్న విషయాన్ని ఆయన ఆనాడే గుర్తించారన్నారు. అందుకే ఆయన ప్రతిభకు గుర్తింపుగా నోబెల్ బహుమతి వచ్చిందని, మనదేశం తరఫున ఈ బహుమతి అందుకున్న మొదటి వ్యక్తి ఆయనేనని గుర్తు చేశారు. ఆయన స్మృతిచిహ్నంగా సాంస్కృతిక సామరస్యానికి కృషి చేసిన వారికి తమ ప్రభుత్వం ప్రతి ఏడాది టాగూర్ అవార్డులను అందజేస్తోందన్నారు. ప్రధాని నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల కమిటీ ఈ అవార్డుకు ఎంపిక చేస్తుందని, దీని కింద కోటి రూపాయల నగదు అవార్డు గ్రహీతకు అందజేస్తున్నామని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ మణిపురి డాన్సర్ రాజ్‌కుమార్ సింఘాజిత్ సింగ్, బంగ్లాదేశ్ కల్చరల్ అసోసియేషన్‌కు చెందిన చయ్యనౌత్, ప్రముఖ శిల్పి రామ్ వంజిత్ సుతార్‌లకు వరుసగా 2014, 2015, 2016 సంవత్సరాలకు సంబంధించి అవార్డులను అందజేశారు. రాజ్‌కుమార్ సింఘాజిత్ సింగ్ మణిపూరి డాన్స్‌కు సంబంధించి పలు ప్రయోగాలు చేసి ప్రశంసలు అందుకున్నారని రాష్టప్రతి ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఆయన మణిపూర్ డాన్స్‌కు సంబంధించి ఈ తరానికి, పాత తరానికి వారధిగా నిలిచారన్నారు. అలాగే చయ్యనౌత్ సంస్థ రవీంద్రనాథ్ టాగూర్ రచనలు, ఆయన మనకు అందించిన సాంస్కృతిక సంపదను భద్రపర్చడమే కాక, ఆయన తత్వాన్ని బంగ్లాదేశ్‌లో విస్తృతంగా ప్రచా రం చేస్తోందన్నారు. అలాగే స్టాట్యూ ఆఫ్ యూని టీ లాంటి విగ్రహం సృష్టి వెనుక శిల్పి రామ్ వంజి సుతార్ లాంటి కృషి ఉందని ప్రశంసించారు.