జాతీయ వార్తలు

వ్యర్థాల డంపింగ్‌పై నివేదిక ఇవ్వండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ఉద్పన్నమవుతున్న వ్యర్థాలవల్ల స్థానిక ప్రజలకు ఇబ్బందులు లేకుండా తీసుకుంటున్న చర్యలపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టు ఆథారిటీని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఏన్జీటీ) ఆదేశించింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణ వ్యర్థాల వల్ల సమీప గ్రామ ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారని, అలాగే పర్యావరణానికి నష్టం జరుగుతోందని, దీనిపై జోక్యం చేసుకోవాలని జనసేన పార్టీ నాయకుడు పెంటపాటి పుల్లారావు దాఖలు చేసిన పిటిషన్‌పై ఏన్జీటీలోని జస్టిస్ ఏకే గోయల్ నేతృత్వంలోని బెంచ్ విచారణ జరిపింది. ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల ఉత్పన్నమైన వ్యర్థాల వల్ల పర్యావరణానికి నష్టం జరిగివుంటే అంచనా వేయాలని, అలాగే వ్యర్థాల వల్ల స్థానిక ప్రజలకు ఇబ్బందులు లేకుండా తీసుకున్న చర్యలపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని పోలవరం ప్రాజెక్టు అథారిటీని బెంచ్ ఆదేశించింది. తదుపరి విచారణను మే 10వ తేదీకి వాయిదా వేసింది.