జాతీయ వార్తలు

మోదీ వైఫల్యాలను ఎండగడతాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో పరాజయాన్ని మూటగట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లోక్‌సభ ఎన్నికల్లో గెలుపుపై దృష్టి సారించింది. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఢిల్లీలోని వార్‌రూమ్‌లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆనంద్ శర్మ నేతృత్వంలో మంగళవారం జరిగిన సమావేశానికి తెలంగాణ కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. టీపీసీసీ క్యాంపెయిన్ కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి, పబ్లిసిటీ కమిటీ చైర్మన్ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఈ సమావేశంలో పాల్గొన్నారు. అనంతరం విజయశాంతి, రాజగోపాల్‌రెడ్డి, ఉత్తమ్‌కుమార్ విలేఖరులతో మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించినట్టు తెలిపారు. గత ఐదేళ్ల కాలంలో ప్రధాని మోదీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజాక్షేత్రంలో ఎండగడతామని చెప్పారు. శాసనసభ ఎన్నికలకు, లోక్‌సభ ఎన్నికలకు చాలా వ్యత్యాసం ఉంటుందని, దేశవ్యాప్తంగా ప్రధాని మోదీ వర్సెస్ రాహుల్ గాంధీ విధానంలోనే లోక్‌సభ ఎన్నికల వెళ్తామని చెప్పారు. అలాగే తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ వర్సెస్ కాంగ్రెస్ పార్టీగా లోక్‌సభ ఎన్నికలకు వెళ్తామని వారు స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచారం విషయంలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చలు జరిపినట్టు చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంకోసం ఎప్పుడు ఎలా పర్యటించాలన్న దానిపై కూడా చర్చించామని తెలిపారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినందున సోనియా పర్యాటనలు ఉండేలా చూడాలని ఈ సమావేశంలో ఆనంద్ శర్మను కోరినట్టు చెప్పారు. లోక్‌సభ ఎన్నికల కోసం ఏఐసీసీ ప్రచార కమిటీతో సమన్వయం చేసుకుంటూ, అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తామని వారు తెలిపారు.