జాతీయ వార్తలు

భద్రతా పరిస్థితులను సమీక్షించిన రాజ్‌నాథ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ మంగళవారం దేశంలో ప్రత్యేకించి జమ్మూకాశ్మీర్‌లో భద్రతా పరిస్థితులను సమీక్షించారు. జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో గత వారం జైషే మొహమ్మద్ ఉగ్రవాది జరిపిన ఆత్మాహుతి బాంబు దాడిలో 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లు మృతి చెందారు. జమ్మూకాశ్మీర్‌లో సోమవారం జైషే మొహమ్మద్ ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మేజర్ సహా అయిదుగురు భద్రతా సిబ్బంది వీరమరణం పొందారు. భద్రతా దళాలు జరిపిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు జైషే మొహమ్మద్ ఉగ్రవాదులు హతమయ్యారు. పుల్వామా ఉగ్రదాడి సూత్రధారులుగా భావిస్తున్న ఇద్దరు జైషే మొహమ్మద్ ఉన్నత స్థాయి కమాండర్లు కూడా మృతుల్లో ఉన్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగిన సమీక్ష సమావేశంలో ఉన్నతాధికారులు పాకిస్తాన్ సరిహద్దులు సహా జమ్మూకాశ్మీర్‌లో నెలకొ న్న పరిస్థితులను హోంమంత్రికి వివరించారని హోంమంత్రిత్వ శాఖ అధికారి ఒకరు తెలిపారు. ఈ సమీక్ష సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజి త్ దోవల్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా, ఇంటెలిజెన్స్ బ్యూరో డైరెక్టర్ రాజీవ్ జైన్ తదితరులు పాల్గొన్నారు. జమ్మూకాశ్మీర్‌లో కార్యకలాపాలు ని ర్వహిస్తున్న ఉగ్రవాదుల ఏరివేత చర్యలు, సరిహద్దుల ఆవల చొరబాట్లను అడ్డుకోవడం ఎలా అనే అంశాలను కూడా ఈ సమావేశంలో సమీక్షించారు.