జాతీయ వార్తలు

823 మంది విదేశీయులే.. నిర్భంద కేంద్రాల్లో 938 మంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: అసోంలోని ఆరు డిటెన్షన్ సెంటర్లలో 938 మంది ఉన్నారని, వీరిలో 823 మందిని విదేశీయులని ట్రిబ్యునల్స్ నిర్ధారించాయని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలియచేసింది. అసోంలో డిటెన్షన్ సెంటర్ల పనితీరుపై నివేదిక ఇవ్వాలని గత నెల 28వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలపై కేంద్రం వివరాలను మంగళవారం సమర్పించింది. ఈ కేసును ప్రధాని న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గగోయ్ అధ్యక్షతన ఉన్న ధర్మాసనం విచారించింది. కేంద్రం తరఫున నివేదికను సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు సమర్పించారు. దేశంలోకి సరిహద్దుల ద్వారా అక్రమంగా చొరబడిన 27వేల మందిని గుర్తించి సరిహద్దుల వద్దనేనిలువరించి వెనక్కు పంపించామన్నారు. కొత్త డిటెన్షన్ సెంట ర్లు , అక్కడ వౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం రూ.47 కోట్లను విడుదల చేసిందన్నారు. మానవ హక్కుల కోణంలోనే ఈ కేసును కేంద్రం చూస్తోందన్నారు. ఈ ఏడాది ఆగస్టు 31వ తేదీ నాటికి కొత్త డిటెన్షన్ సెంటర్ ఏర్పాటవుతుందన్నారు. 52వేల మందిని విదేశీయులని ట్రిబ్యునల్ ఖరారు చేసినా, ఇంతవరకు 162 మందిని మాత్రమే వెనక్కు పంపించామన్నారు. జాతీయ పౌర రిజిస్టర్ ప్ర క్రియను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని కోర్టు ఆదేశించింది. అసోంలోకి విదేశీయులు చొరబడడమనేది 50 ఏళ్లుగా సాగుతోందన్నారు. విదేశీయులుగా గుర్తించినవారిని స్వదేశానికి పంపించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. డిటెన్షన్ సెంటర్లలో పరిస్థితులపై నివేదిక ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.