జాతీయ వార్తలు

ఆరోగ్యం బాగోలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఢఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఎదుట రాబర్ట్ వాద్రా మంగళవారం హాజరు కాలేదు. అనారోగ్య కారణాల వల్ల ఈడీ విచారణకు హాజరుకాలేకపోతున్నట్లు లిఖితపూర్వకమైన సమాధానం తెలియచేశారని ఈడీ వర్గాలు తెలిపాయి. తన క్లైంటు అనారోగ్యంగా ఉన్నాడని, విచారణకు హాజరు కాలేని పరిస్థితిలో ఉన్నాడని, అభియోగాల కేసులో ఈడీ ఆదేశాలకు అనుగుణంగా రావాలని ఉన్న ఆరోగ్యం సహకరించడం లేది వాద్రా తరఫున న్యాయవాది తెలిపారు. సోనియాగాంధీ అల్లుడు, ఎఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి రాబర్ట్ వాద్రా బావ అవుతారు. ఈ నేపథ్యంలో బుధవారం లేదా మరో రోజు వాద్రా హాజరయ్యే అవకాశం కనపడుతోంది. ఈ నెల మొదటి వారంలో వాద్రాను ఈడీ 23 గంటల పాటు విచారించింది. ఈడీ దర్యాప్తుకు సహకరించాలని ఢిల్లీ కోర్టు గతంలో వాద్రాను ఆదేశించింది. లండన్‌లో 1.9 మిలియన్ బ్రిటీష్ పాండ్ల విలువైన ఆస్తులను వాద్రా సమకూర్చుకున్నట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. లండన్‌లో వాద్రాకు సంబంధించి వేరు వేరు ఆస్తులున్నట్లు ఈడీ దర్యాప్తులో వెల్లడైనట్లు ఆ ఏజన్సీ కోర్టుకు తెలిపింది. కాగా రాజకీయ ప్రయోజనాల కోసమే వాద్రాను వేధిస్తున్నారని ఆయన తరఫున న్యాయవాది చెబుతున్నారు. గత మూడు సార్లు ఈడీ అధికారులు విచారించినప్పుడు తనను వేధిస్తున్నారంటూ మాత్రమే వాద్రా చెప్పేవారని అధికార వర్గాలు తెలిపాయి. ప్రియాంక గాంధీ కూడా తన భర్త వెంట దర్యాప్తు ఏజన్సీకి వచ్చి ఆయనను డ్రాప్ చేయడం కూడా వివాదస్పదంగా మారుతోంది.