జాతీయ వార్తలు

మా పాత్ర లేనేలేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరువనంతపురం, ఫిబ్రవరి 19: హింసను ప్రేరేపించడం, హింసాకాండ చర్యలకు సీపీఐ(ఎం) ఎప్పడూ మద్దతు ఇవ్వబోదని కేరళ ముఖ్యమంత్రి పినయరి విజయన్ అన్నారు. కసరగోడ్‌లో మంగళవారం ఇద్దరు యువజన కాంగ్రెస్ కార్యకర్తల హత్య కేసుతో తమ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆయన స్పష్టం చేశారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తల మృతి సీపీఐ(ఎం) పార్టీనే కారణమంటూ, ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న విషయాన్ని ప్రస్తావిస్తూ సీఎం ఈ వ్యాఖ్యలు చేశారు. మంగళవారం సెక్రటేరియట్‌లో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సీపీఐ(ఎం) నాయకత్వంలోని లెఫ్ట్ డెమొక్రటిక్ ఫ్రంట్ (ఎల్‌డీఎఫ్) ప్రభుత్వం జరిగిన సంఘటనపై సమగ్ర పోలీస్ విచారణకు ఆదేశించిందని, ఇందుకు బాధ్యులైనవారిని కోర్టు ఎదుట హాజరుపరచాలని ఆదేశించిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తల హత్యకు సంబంధించి సీపీఐ(ఎం) కార్యకర్తల ప్రమేయం ఉంటే అలాంటి వారిని మళ్లీ పార్టీలోకి తీసుకునే చానే్స లేదని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా అలాంటి కార్యకర్తలపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని, పార్టీపరంగా కూడా తగిన చర్యలు చేపడతామని ఆయన పేర్కొన్నారు. ‘సీపీఐ(ఎం) ఎన్నడూ హింసను ప్రోత్సహించదు. ఎన్నో కార్యక్రమాల సందర్భంగా మేము కూడా ఇలాంటి వాటిని చవిచూశాం. ఇలాంటి పరిస్థితుల్లో యువజన కాంగ్రెస్ కార్యకర్తలను హత్య చేయాల్సిన అవసరం మాకేమి వచ్చింది’ అని ముఖ్యమంత్రి పినరయి విజయన్ ప్రశ్నించారు. ఆదివారం జరిగిన ఘటనపై మీడియా ప్రతినిధులు వేసిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఆయన పైవిధంగా అన్నారు. ‘లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీపీఐ(ఎం) యాత్రను నిర్వహిస్తోంది. ఆ సమయంలో రాజకీయం తెలిసినవాడెవడైనా ఇలాంటి హత్యలకు పాల్పడతాడా? అని ఆయన ప్రశ్నించారు.