జాతీయ వార్తలు

‘వందే భారత్’పై అవాకులా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి, ఫిబ్రవరి 19: రైల్వేశాఖ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ‘వందే భారత్ ఎక్స్‌ప్రెస్’ సెమీ హైస్పీడ్ రైలుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్షాల తీరు అత్యంత గర్హనీయమన్న ప్రధాని ‘మన ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను అవమానించేవే’అని దుయ్యబట్టారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ, ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ వందే భారత్‌పై చేసిన వ్యంగ్యోక్తులపై మోదీ విరుచుకుపడ్డారు. వారణాసి-్ఢల్లీ మధ్య ప్రవేశపెట్టిన ఈ సెమీ హైస్పీడ్ రైలు శనివారం నుంచి నడుస్తోంది. అయితే తొలి రోజు కొన్ని సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రెండున్న గంటల ఆలస్యంగా నడించింది. దీనిపై ప్రతిపక్షాలు విమర్శలు చేశాయి. కేంద్రం ఆర్భాటంగా ప్రారంభించిన హైస్పీడ్ రైలుకు ఆదిలోనే హంసపాదు అంటూ రాహుల్, అఖిలేష్ ధ్వజమెత్తారు.‘ ప్రయాణికులకు సౌకర్యం కలిగేంచేందుకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను తీసుకొచ్చాం. అయితే కొందరు వ్యక్తులు హైస్పీడ్ రైలును లక్ష్యంగా చేసుకుని ఎగతాళి చేసేలా మాట్లాడుతున్నారు. ఇది అత్యంత దురదృష్టరం. ఒక విధంగా ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను అవమానించడమే’అని వారణాసి బహిరంగ సభలో మోదీ నిప్పులు చెరిగారు. ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలు చేస్తున్న వారిని పట్టించుకోవద్దని ప్రజలకు ఆయన పిలుపునిచ్చారు. ప్రతిపక్షాలను విమర్శలు చేయనీయండి అన్న ప్రధాని ‘దేశంలో బుల్లెట్ రైలు కూత కూస్తుంది’అని ప్రకటించారు. ‘ఇంజనీర్లకు నా సలాములు. మీరే భవిష్యత్‌లో బుల్లెట్ రైలునుపట్టాలెక్కించాల్సింది’అని ఆయన వ్యాఖ్యానించారు. నిపుణలపై చౌకబారు విమర్శలు చేసే వారికి కాలమే తగిన గుణపాఠం చెబుతుందని, ప్రజల ఆగ్రహానికి గురికావడం ఖాయమని ప్రధాని మోదీ హెచ్చరించారు. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేకిన్ ఇండియాపై కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌పై విమర్శలు చేశారు. రైలు తిరుగుప్రయాణంలో ఆలస్యంపై ఆయన సెటైర్లు వేశారు. ‘మోదీజీ మేక్ ఇన్ ఇండియాపై మరోసారి పునరాలోచించుకోండి. మీ పథకం ఫైయిలైనట్టు అత్యధిక మంది భావిస్తున్నారు’అని రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.సమాజ్‌వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్ కూడా వందే భారత్‌ను లక్ష్యంగా చేసుకుని ట్వీట్లు చేశారు. ‘మీ ప్రభుత్వంలాగే కొత్త రైలు ఉంది. వందే భారత్‌ను మీరు అభివృద్ధిగా చెబుతున్నారు. దేశంలో రైతులు, యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు’అని అఖిలేష్ ట్వీట్‌చేశారు. దేశంలో భద్రతా వ్యవస్థ ఘోరంగా విఫలమైందని చెప్పడానికి కాశ్మీర్ మారణకాండే నిదర్శమన్న అఖిలేష్ ‘ప్రజలకు బుల్లెట్ రైలుకాదు.. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు కావాలి’అంటూ తీవ్ర విమర్శలు చేశారు.
చిత్రం.. వారణాసిలో మంగళవారం జరిగిన కార్యక్రమంలో
ప్రజలకు అభివాదం చేస్తున్న ప్రధాని మోదీ, యూపీ సీఎం ఆదిత్యనాథ్