జాతీయ వార్తలు

కుల వివక్ష సామరస్యానికి చేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వారణాసి (యూపీ), ఫిబ్రవరి 19: సమాజంలో కులపరమైన అసమానతలను పారద్రోలాలని, అప్పుడు సమసమాజ స్థాపన సాధ్యమని ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపునిచ్చారు. భక్తి ఉద్యమ నిర్మాతల్లో ఒకరైన సంత్ రవిదాస్ గొప్ప యోగి పుంగవుడు, సంస్కరణవాది అని ఆయన నివాళులు అర్పించారు. సామాజిక దురాచారాలను తరిమిగొట్టాలని, మానవులంతా ఒక్కటేనన్న లక్ష్యసాధనకు నిరంతరం కృషి చేసిన మహానుభావుడు సంత్ రవిదాస్ అన్నారు. కులం ప్రాతిపదికన వివక్ష పనికిరాదన్నారు. కులాచారాలు పాటించేవరకు మనుషుల మధ్య అంతరాలు కొనసాగుతాయన్నారు. మానవుల మధ్య అనుసంధానం కావాలన్నారు. కులగజ్జి, సాటి మనిషి పట్ల వివక్షత ప్రదర్శించేవారిని దూరంగా పెట్టాలన్నారు. మంగళవారం ఇక్కడ ఆయన రవిదాస్ జన్మస్థలి ఏరియా డెవలప్‌మెంట్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 15,16 శతాబ్థాలు భక్తి ఉద్యలంలో కీలకపాత్ర వహించాయన్నారు. వారణాసిలో జన్మించిన సంత్ రవిదాస్ గానం, ఆధ్యాత్మికతత్వం ద్వారా కులాచార విధానాలపై యుద్ధం ప్రకటించారన్నారు. సిక్కు మతంలో కూడా సంత్ రవిదాస్ ప్రబోధనలు కనపడుతాయన్నారు. తమ ప్రభుత్వం గత ఐదేళ్లుగా సంత్ రవిదాస్ గీతోపదేశాన్నిఅమలు చేసేందుకు ప్రయత్నించిందన్నారు. విద్య, ఆదాయం, వైద్యం, సాగునీటి రంగం, ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఏర్పాటుకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. ఇంతవరకు ఎంత కృషి చేసినా కులతత్వ ధోరణలను పూర్తిగా అరికట్టలేకపోయామన్నారు. యువకులను భాగస్వామ్యం చేసి కుల వ్యవస్థను నిర్మూలించారన్నారు. స్థానిక డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ లో మొదటి విద్యుత్ లోకోమోటివ్ ఇంజన్‌ను ప్రారంభించారు. డీజిల్ నుంచి విద్యుత్‌కు లోకోమోటివ్ వ్యవస్థను మార్చేందుకు 2017లో చర్యలు చేపట్టామని ప్రధాని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో తమ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలను వివరించారు. దేశంలో నల్లధనం నిర్మూలనకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నాలరు. బినామీ లావాదేవీలపై ఉక్కుపాదం మోపామన్నారు. ఈ సమావేశంలో యూపీ సీఎం యోగీ ఆదిత్యనాథ్ దాస్ మాట్లాడుతూ మోదీ పాలనతీరును ప్రశంసించారు. ఈ రోజ మోదీ కాశీ పుత్రుడని ఆయన కొనియాడారు.
చిత్రం.. వారణాసిలో ఓ దివ్యాంగ యువకుడిని పలకరిస్తోన్న ప్రధాని నరేంద్ర మోదీ