జాతీయ వార్తలు

తుపాకి పడితే కాల్చిపారేస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 19: పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి జరిగిన వంద గంటల్లోనే జైషే మహమ్మద్ కశ్మీర్ విభాగం నాయకత్వాన్ని నిర్మూలించామని లెఫ్టినెంట్ జనరల్ కె.ఎస్.్థల్లాన్ ప్రకటించారు. థిల్లాన్ మంగళవారం శ్రీనగర్‌లో సైన్యానికి చెందిన 15కార్ప్స్ కేంద్ర కార్యాలయంలో విలేఖరులతో మాట్లాడుతూ పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న జైషే మహమ్మద్ నాయకత్వం పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి చేయించిందని ప్రకటించారు. సోమవారం నాటి ఎన్‌కౌంటర్‌లో జైషే మహమ్మద్ కశ్మీర్ విభాగం అధినాయకుడు కమరన్, మరో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారని అన్నారు. కశ్మీర్‌లో ఇక మీదట తుపాకితో కనిపించే ప్రతి వ్యక్తిని కాల్చివేస్తామని థిల్లాన్ చెప్పారు. తమ సంతానాన్ని జన జీవన స్రవంతిలో కలిపేందుకు కృషి చేయాలని ఆయన కశ్మీర్‌లోని మహిళలు, ముఖ్యంగా తల్లులకు విజ్ఞప్తి చేశారు. యువత జన జీవన స్రవంతిలో కలిసేందుకు ముందుకు వస్తే అన్ని విధాలా ఆదుకుంటాం.. తోడ్పడతాం.. దీనికి భిన్నంగా ఉగ్రవాదంలోనే కొనసాగాలని భావించే పక్షంలో తీవ్ర పరిణామాలను ఎదుర్కోక తప్పదని ధిల్లాన్ ప్రకటించారు. పుల్వామా దాడిని పాకిస్తాన్ కేంద్రంగా పని చేస్తున్న జైషై మహమ్మద్ అధినాయకత్వం పర్యవేక్షించింది.. వారి సూచనలు, సలహాల మేరకు దాడి కొనసాగింది.. పాకిస్తాన్ సైన్యం, పాక్ గూఢచార సంస్థ ఐఎస్‌ఐ జైషే మహమ్మద్ అధినాయకత్వానికి తోడ్పడ్డారని థిల్లాన్ తెలిపారు. జమ్ముకశ్మీర్ పోలీసులు, సైన్యం, స్పెషల్ గ్రూపు సంస్థ, నిఘా విభాగాలు సంయుక్తంగా జరిపిన దాడిలో జైషే మహమ్మద్ కశ్మీర్ విభాగం అధినాయకత్వాన్ని మట్టుబెట్టామని థిల్లాన్ తెలిపారు. పుల్వామా దాడిని పర్యవేక్షించిన జైషే మహమ్మద్ కశ్మీర్ విభాగం నాయకుడు కమరన్‌ను సోమవారం మట్టుబెట్టినట్లు థిల్లాన్ అధికారికంగా ప్రకటించారు. భద్రతా దళాల సంయుక్త విభాగం కమరన్ ముఠా సమాచారాన్ని సేకరించిన సమష్టిగా దాడి జరిపి మట్టుబెట్టిందని ఆయన చెప్పారు. కాన్వాయ్‌పై జరిగిన దాడికి కుట్ర పన్నిన ఇతరుల సమాచారం సేకరించేందుకు దర్యాప్తు జరుగుతోంది.. దర్యాప్తులో లభించే సమాచారం మేరకు ఇతరులపై కూడా చర్యలుంటాయి అని ఆయన అన్నారు. పక్కా సమాచారం మేరకే కమరన్, ఇతర ఇస్లామిక్ ఉగ్రవాదుల మాడ్యూలుపై భద్రతా దళాలు దాడి చేశాయని ఆయన చెప్పారు. భద్రతా దళాల దాడిలో ఇద్దరు పాకిస్తానీ ఉగ్రవాదులు, ఒక స్థానిక ఉగ్రవాదిని మట్టుబెట్టామని అన్నారు. స్థానిక యువకుల తల్లిదండ్రులకు ఒక ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నా.. మీ యువతను ఉగ్రవాదానికి దూరంగా ఉంచండి.. దీనికోసం తమనుంచి పూర్తి సహాయ, సహకారాలు ఉంటాయని థిల్లాన్ ప్రకటించారు. కశ్మీర్ సమాజంలో తల్లులు అత్యంత కీలకపాత్ర నిర్వహిస్తారు.. మీకు ప్రత్యేక విజ్ఞప్తి చేస్తున్నా.. మీ పిల్లలను ఉగ్రవాదం నుండి బైటికి తెచ్చి జన జీవన స్రవంతిలో చేర్చాలని సూచించారు. ఉగ్రవాదంలో చేరిన యువత భద్రతా దళాలకు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోవాలి.. లేని పక్షంలో తుపాకి పట్టుకున్న ప్రతి వ్యక్తిని కాల్చివేస్తాం అని థిల్లాన్ స్పష్టమైన ప్రకటన చేశారు. ఉగ్రవాద సంస్థల్లో చేరిన యువత లొంగిపోవాలి.. లేని పక్షంలో తూటాలను ఎదుర్కోక తప్పదు.. ఈ వాస్తవాన్ని తల్లిదండ్రులు గుర్తించాలని ఆయన చెప్పారు. కేంద్ర ప్రభుత్వం మంచి లొంగుబాటు విధానాన్ని అమలు చేస్తోంది.. దీనికి అనుగుణంగా ఇస్లామిక్ ఉగ్రవాదంలో ఉన్న యువకులు లొంగిపోవటం మంచిదనేది తల్లిదండ్రులు గ్రహించాలన్నారు. ఎన్‌కౌంటర్‌లో గాయపడిన సైనికాధికారులు, జవాన్లు కోలుకుంటున్నారు.. వారికి అత్యంత ఆధునిక వైద్య సహాయం అందుతోందని ఆయన చెప్పారు. కారుబాంబు దాడి, నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌లో వీర మరణం పొందిన జవాన్లు, అధికారులకు నివాళులు అర్పిస్తున్నానని థిల్లాన్ చెప్పారు.
చిత్రం.. శ్రీనగర్‌లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతున్న
లెఫ్టినెంట్ జనరల్ కె.ఎస్.థిల్లాన్, ఐజీ ఎస్పీ ఫణి