జాతీయ వార్తలు

ఎన్నికల షెడ్యూల్ ఆలస్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: పుల్వామా దాడి కారణంగా పాకిస్తాన్‌తో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటన వారం పది రోజులు ఆలస్యం కావచ్చునని ప్రభుత్వ వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి ఆఖరు వారం లేదా మార్చి మొదటి వారంలో విడుదల కావచ్చునని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు చెప్పటం తెలిసిందే. అయితే పుల్వామా దాడి నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటన కొంత ఆలస్యమవుతుందని అంటున్నారు. మార్చి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి ఏప్రిల్ 20 నుండి మే 20వ తేదీలోగా ఎన్నికల ప్రక్రియ ముగించవచ్చునని మొదట అంచనా వేశారు. పదిహేడవ లోక్‌సభ సభను జూన్ ఐదవ తేదీలోగా ఏర్పాటు చేయవలసి ఉంటుంది. ఇప్పుడు మార్చి రెండోవారం ఆఖరున షెడ్యూల్ విడుదల చేయవచ్చుననీ, ఇంతలో భారత సైన్యం ప్రతీకార చర్యల ప్రక్రియను పూర్తి చేయవచ్చునని అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాది అజర్ మసూద్ నాయకత్వంలోని జైషే మహమ్మద్ ఇస్లామిక్ ఉగ్రవాదులు పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై దాడి చేసి నలభై మంది జవాన్లను పొట్టన పెట్టుకున్నందుకు ప్రతీకారంగా ఎన్‌డీఏ ప్రభుత్వం పాకిస్తాన్‌లోని ఉగ్రవాదుల కేంద్రాలపై దాడి చేయవచ్చుననే వార్తలు రావటం తెలిసిందే. పాక్ ఆక్రమిత కాశ్మీర్ లేదా పాకిస్తాన్‌లో ఉగ్రవాద కేంద్రాలపై భారత సైన్యం దాడి చేసిన అనంతరం లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావచ్చుననే మాట వినిపిస్తోంది. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకుంటాం.. అందుకు సైన్యానికి పూర్తి స్వేచ్చ ఇచ్చామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రకటించటం తెలిసిందే. ఈ ప్రకటన మేరకు పాక్ ఆక్రమిత కాశ్మీర్ లేదా పాకిస్తాన్‌లోని ఏ ప్రాంతంలో దాడి చేయాలనే దానిపై భారత సైన్యం దృష్టి కేంద్రీకరించిందని అంటున్నారు. మెరుపు దాడి లేదా యుద్ధ విమానలతో దాడి చేస్తారా లేక త్రివిధ దళాల సంయుక్త దాడి జరుగుతుందా అనే అంశంపై దేశ రాజధాని ఢిల్లీలో చర్చలు జరుగుతున్నాయి. భారత సైన్యం మార్చి రెండోవారంలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లేదా ఎంపిక చేసిన మరో ప్రదేశంలోని ఉగ్రవాదుల శిబిరాలపై దాడి చేయవచ్చునని అంటున్నారు. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకోకుండా లోక్‌సభ ఎన్నికలు వెళ్లటం రాజకీయం ఎన్డీయేకు ఆత్మహత్యా సదృశ్యమే అవుతుంది. ప్రతీకార దాడుల తరువాత ఎన్నికలకు వెళ్లటం వలన ప్రభుత్వం పరువు కాపాడుకోవటంతోపాటు ఎన్నికల్లో రాజకీయంగా ప్రయోజనం పొందవచ్చు. ప్రతీకార దాడి ద్వారా స్పష్టమైన ఫలితాలను సాధించాలన్నది మోదీ ప్రభుత్వం ఆలోచన. అయితే ప్రతీకార దాడిలో ఎదురుదెబ్బ తగిలితే ప్రతిపక్షాలు తమని రాజకీయంగా దెబ్బతీయగలుగుతాయని మోదీ ప్రభుత్వం ఆందోళన చెందుతోంది. మోదీ ప్రభుత్వం ఈ లక్ష్య సాధన దిశగా పావులు కదుపుతోందని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. పుల్వామా దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు భారత సైన్యం అత్యంత పటిష్టమైన వ్యూహాన్ని తయారు చేస్తోందని అంటున్నారు. ఉరి దాడి తరువాత భారత సైన్యం మెరుపు దాడి చేసినప్పుడు పాకిస్తాన్ ఆశ్చర్యపోవటం తెలిసిందే. భారత సైన్యం మెరుపు దాడి చేస్తుందని పాక్ సైన్యం అంచనా వేయలేకపోయిది. అయితే పుల్వామా దాడి నేపథ్యంలో భారతదేశం మెరుపు దాడి లాంటిది చేయవచ్చునని భావిస్తున్న పాకిస్తాన్ సైన్యం దీనిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉంది. భారత సైన్యం దాడి చేస్తే గట్టి జవాబు చెబుతామని పాకిస్తాన్ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ మీడియా ముఖంగా ప్రకటించటం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత సైన్యం పాకిస్తాన్ సైన్యం కన్నుకప్పి ఇస్లామిక్ ఉగ్రవాదుల శిబిరాలపై దాడి చేసి భారీ నష్టం కలిగించి సురక్షితంగా వెనక్కు రాగలిగేలా ఏర్పాట్లు చేస్తోందని రక్షణ శాఖ అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. భారత సైన్యం తమకు అనుకూలంగా ఉండే సమయం, ప్రాంతాన్ని పరిశీలించి ప్రతీకారం తీర్చుకుంటుందని, అది లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే లోగా చేస్తుందా లేక షెడ్యూల్ విడుదలైన తరువాత చేస్తుందా అనేది చెప్పటం కష్టమని రక్షణ శాఖ అధికారులు చెబుతున్నారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌కు, ప్రతీకార దాడులకు ముడిపెట్టడం ఎంతమాత్రం సబబు కాదు.. దేని దారి దానిదేనన్నది వారి అభిప్రాయం.