జాతీయ వార్తలు

క్లాసు రూముల్లో ఇక డిజిటల్ బోర్డులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ/హైదరాబాద్, ఫిబ్రవరి 20: విద్యా వ్యవస్థ ఇక కొత్తరూపు సంతరించుకోనుంది. నాణ్యమైన విద్యను అందించేందుకుగాను తరగతి గదుల్లో ‘ఆపరేషన్ డిజిటల్ బోర్డు’లను కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి ప్రకాశ్ జావడేకర్ ఢిల్లీలో బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జావడేకర్ మాట్లాడుతూ విద్యార్థులకు నైపుణ్యంతో కూడిన విద్య అందించాలన్న లక్ష్యంతో సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆపరేషన్ డిజిటల్ బోర్డులను ప్రారంభించినట్టు చెప్పారు. దేశవ్యాప్తంగా తొమ్మిదో తరగతి నుంచి ఉన్నత విద్యా సంస్థల్లో ప్రభుత్వం, ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ డిజిటల్ బోర్డులను ప్రవేశపెడతామని వెల్లడించారు. ఈ ప్రక్రియ 2019 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా డిజిటల్ తరగతి గదులను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. విద్య రంగంలో నైపుణ్యాన్ని పెంచేందుకు ఎదురౌవుతున్న సవాళ్లను అధిగమించడంతోపాటు నాణ్యతా ప్రమాణాలను పెంచేందుకు ఈ డిజిటల్ తరగతి గదులు ఉపయోగపడతాయని మంత్రి అన్నారు. దేశంలో అధిక సంఖ్యలో ఉన్నత విద్యా సంస్థలు ఉన్నప్పటికీ నాణ్యత, బోధన అభ్యాసంలో మెరుగుపడాల్సిన అవసరం ఉందని అన్నారు. సాంకేతిక విద్య అనుసంధానం, విద్యా ప్రమాణాలు పెంచేందుకు ఈ ప్రాజెక్టు అన్ని విధాలుగా ఉపయోగపడుతుందన్న జావడేకర్ ఆశాభావం వ్యక్తం చేశారు. గత జనవరి 29న సమావేశమైన యూజీసీ 2022నాటికి ప్రతి తరగతి గదిలో డిజిటల్ బోర్డులను విస్తరించాలనే తీర్మానానికి ఆమోదం తెలిపింది. దేశ వ్యాప్తంగా దాదాపుగా ఐదు లక్షల తరగతి గదులు ఉంటాయని అంచనా వేసిన యూజీసీ.. మొదటి దశలో రెండు లక్షల తరగతి గదుల్లో డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ డిజిటల్ బోర్డును అమలులోకి తెస్తుండడంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని వేలాది విద్యాసంస్థలకు భారీగా నిధులు రానున్నాయి. ఇంతకాలం ఆపరేషన్ బ్లాక్ బోర్డు పథకం అమలుకు రాజీవ్ విద్యా మిషన్, సర్వ శిక్షా అభియాన్ పథకాల కింద పాఠశాలల్లో వౌలిక సదుపాయాల కల్పనకు నిధులను కేటాయించారు. ఉన్నత విద్యాసంస్థలకు టెక్విప్ కింద నిధులు కేటాయించారు. దేశం అంతా డిజిటల్ యుగంవైపు పయనిస్తున్న క్రమంలో డిజిటల్ చెల్లింపులు, డిజిటల్ లెర్నింగ్, డిజిటల్ మీడియా, డిజిటల్ క్లాసురూమ్‌లు ఏర్పాటవుతున్నాయి. ఈ క్రమంలో స్కూళ్లలో సైతం కంప్యూటర్ ల్యాబ్‌లు, డిజిటల్ క్లాసు రూమ్‌లు ఏర్పాటవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో విద్యాపాలనకు ప్రత్యేకించి టీవీ చానళ్లు పనిచేస్తున్నాయి. వీటిని కొన్ని ఉన్నత విద్యాసంస్థల్లోనూ, డిగ్రీ కాలేజీల్లోనూ వినియోగించుకుంటూ విద్యార్థులను డిజిటల్ క్లాసు రూముల్లో కూర్చోబెట్టి ప్రదర్శిస్తున్నారు. అయితే పాఠశాల స్థాయి నుండి యూనివర్శిటీ స్థాయివరకూ విద్యాపాలనలో సమూల మార్పులు తీసుకురావాలని కేంద్రం నిర్ణయించడంతో పాటు ఈ ఆలోచనను ఈ విద్యాసంవత్సరం నుండే అమలు చేయాలని నిర్ణయించడంతో బ్లాక్ బోర్డుల స్థానే అన్ని స్కూళ్లలో డిజిటల్ బోర్డులు ఏర్పాటు కానున్నాయి. ఈ పథకానికి కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ డిజిటల్ బోర్డు అని పేరుపెట్టింది. ఈ కార్యక్రమాన్ని ఇక్కడితో వదిలిపెట్టకుండా నూతన టెక్నాలజీలను సైతం వినియోగించుకుని కృత్రిమ మేథస్సు, డాటా అనలైటిక్స్ వంటి నూతన శాస్త్రాలపై కూడా విద్యార్థులు పట్టుసాధించేలా చర్యలు తీసుకోనున్నారు. దేశవ్యాప్తంగా ఏకరీతి ప్రమాణాలు సాధించడం ద్వారా జాతీయ స్థాయిలో జరిగే అన్ని ప్రవేశపరీక్షలకు విద్యార్థులు సమాన ప్రతిభాపాటవాలు కలిగి ఉండేలా చూస్తామని పేర్కొన్నారు. ఇ పాఠశాల, దీక్ష, ఎన్‌ఆర్‌ఈఓఆర్, ఎన్‌పీటెల్, ఈపీజీ పాఠశాల, స్వయం, స్వయం -ప్రభ, డీటీహెచ్ చానళ్లును కేంద్రం ఇప్పటికే అమలుచేస్తోంది. తొలుత ఈ పథకం ఉన్నత విద్యా సంస్థల నుండి మొదలవుతుంది. ఉన్నత విద్యాసంస్థల్లో ఆపరేషన్ డిజిటల్ బోర్డు కార్యక్రమాన్ని యూజీసీ అమలుచేస్తుంది. 2022 నాటికి అన్ని విద్యాసంస్థల్లో డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని అమలుచేస్తున్నారు. తొలి దశలో దేశవ్యాప్తంగా 300 యూనివర్శిటీలు, వెయ్యి కాలేజీల్లో 2 లక్షల తరగతి గదుల్లో ఈ డిజిటల్ బోర్డులు ఏర్పాటు చేస్తారు. ఇందుకోసం 2వేల కోట్లు వ్యయం అవుతుందని కేంద్రం అంచనాలు వేసింది. అయితే పాఠశాలల్లో మాత్రం ఆయా రాష్ట్రాల సహకారంతో డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేస్తారు.

చిత్రం.. ఢిల్లీలో బుధవారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతున్న కేంద్ర మంత్రి ప్రకాశ్ జావడేకర్