జాతీయ వార్తలు

ఉగ్రవాదం నిర్మూలనకు ఇరుదేశాల పోరాటం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఉగ్రవాదం నిర్మూలనకు ఇరుదేశాలు ఉమ్మడిగా పోరాడాలని సౌదీ అరేబియా, భారత్ ప్రకటించాయి. బుధవారం ఇక్కడ ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌లు సమావేశమై ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఇరువురు నేతలు ఉభయ దేశాలు అభివృద్ధి కోసం అనుసరించాల్సిన వ్యూహాత్మక అంశాలను చర్చించారు. పుల్వానా ఉగ్రవాది దాడిని సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఖండించినట్లు విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది. ప్రపంచ వ్యాప్తంగా ఉద్రిక్తతల నివారణకు కృషి చేయాలని ఇరుదేశాలు నిర్ణయించాయి. పుల్వానా దాడిని అమానవీయ దాడిగా సౌదీ రాజు సల్మాన్ అభివర్ణించారు. ఇలాంటి చర్యలను సౌదీ అరేబియా అనుమతించదన్నారు. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అణచివేయాల్సిందేనని, ఉగ్రవాదం వల్ల మానవాళికి ముప్పు పొంచి ఉందని ఇరుదేశాల అధినేతలు సమావేశంలో అభిప్రాయపడ్డారు. ఉగ్రవాదం సమాచారం పంచుకోవాలని సమావేశంలో విధి విధానాలను ఖరారు చేశారు. ఉగ్రవాదుల వౌలిక సదుపాయాలను నాశనం చేయాలని, బాధ్యులైనవారిని అత్యంత కఠినంగా శిక్షించాలని సల్మాన్ పేర్కొన్నారు. యువకులు పెడద్రోవపట్టకుండా ప్రతి దేశం చర్యలు తీసుకోవాలని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు భారత్ ఉగ్రవాదాన్ని ఇక ఏ మాత్రం ఉపేక్షించిందన్నారు. ఉగ్రవాదం కదలికలు, సమాచారాన్ని వెంటనే భారత్‌కు అందిస్తామని సౌదీ అరేబియా రాజు సల్మాన్ తెలిపారు. భారత్‌కు రాకముందు రాజు సల్మాన్ పాక్‌లో పర్యటించారు. ఉగ్రవాదాన్ని ప్రోత్సహించవద్దని ఆయన పాక్ నేతలను కోరిన విషయం విదితమే.

చిత్రం.. న్యూఢిల్లీలోని హైదరాబాద్ భవన్‌లో బుధవారం సౌదీ అరేబియాతో ద్వైపాక్షిక ఒప్పంద పత్రాలను ార్చుకుంటున్న భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్, సౌదీ అరేబియా ఇంధనం, పరిశ్రమలు, ఖనిజ వనరుల మంత్రి ఖలీద్ బిన్ అబ్దుల్ అజీజ్ అల్ ఫలీ. ఈ ఒప్పందాన్ని తిలకిస్తున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ, సౌదీ అరేబియా యువరాజుగా పట్ట్భాషక్తుడైన మహమ్మద్ బిన్ సల్మాన్ బిన్ అబ్దుల్‌అజీజ్ అల్ సౌద్