జాతీయ వార్తలు

పర్యావరణాన్ని కాపాడుదాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20: పర్యావరణ పరిరక్షణకు ఆచరణాత్మక ఆలోచనలతో ముందుకు రావాలని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ బుధవారం ఇక్కడ పిలుపునిచ్చారు. సహజ వనరులను సద్వినియోగం చేసుకోవడం ద్వారా కాలుష్యకారకాలపై ఉద్గారాలను తగ్గించ వచ్చని ఆయన ఉద్ఘాటించారు. అభివృద్ధి చెందిన, చెందుతున్న దేశాల్లో పర్యావరణానికి పెను సవాళ్లు ఎదురవుతున్నాయని ఆయన అన్నారు. సంప్రదాయ ఇంధన వనరులను వాడుకలోకి తీసుకురావడం వల్ల కాలుష్య తీవ్రతను తగ్గించడంతోపాటు పరిశుభ్రమైన వాతావరణం సాకారమవుతుందని కోవింద్ అన్నారు. సహజ వనరులను వినియోగంలోకి తీసుకొచ్చి ‘ఎకో ఫ్రెండ్లీ’కి కృషి చేయాలని పరిశోధకులు, నిపుణులకు పిలుపునిచ్చారు. ‘ఇంధనం- పర్యావరణం: సవాళ్లు-అవకాశాలు(ఎకో 2019)’ పేరుతో ఢిల్లీలో ఏర్పాటైన ఎగ్జిబిషన్, అంతర్జాతీయ సెమినార్‌ను రాష్టప్రతి కోవింద్ ప్రారంభించారు. కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చి సంస్థ దీన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచంలోని అనేక దేశాల్లో బొగ్గు ప్రధాన ఇంధన వనరుగా ఉందన్నారు. బొగ్గు ఉత్పత్తిలో భారత్ క్రీయాశీల పాత్ర పోషిస్తోందని తెలిపారు. అలాగే పునరుత్పాదకేతర ఇంధన వనరులు సద్వినియోగంలోకి వచ్చినట్టు రాష్ట్రపతి చెప్పారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుంటూ దేశంలోని ప్రతి పౌరుడికి సరసమైన ధరకే విద్యుత్ అందజేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోందని కోవింద్ పేర్కొన్నారు. కార్బన్ ఉద్గారాలను తగ్గించేందుకు భారత్‌లో కృషి జరుగుతోందన్న రాష్ట్రపతి ప్యారిస్ ఒప్పందం అమలుకు కట్టుబడి పనిచేస్తోందని వెల్లడించారు. సంప్రదాయ ఇంధన వనరులను మరింత ఎక్కువగా సద్వినియోగంలోకి తీసుకొచ్చి పచ్చదనం కోసం కృషి చేద్దామని పర్యావరణవేత్తలు, నిపుణులకు ఆయన పిలుపునిచ్చారు. ఇలాంటి వేదికల వల్ల మంచి ఫలితాలు వస్తాయన్న విశ్వాసం ఆయన వ్యక్తం చేశారు.