జాతీయ వార్తలు

బుజ్జగింపే కొంపముంచింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భవానిపట్న (ఒడిసా), ఫిబ్రవరి 20: గతంలో దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఉగ్రవాదం విషయంలో ‘బుజ్జగింపు విధానం’ అమలు చేయడం వల్లే ఉగ్రవాదం పెరిగిపోయిందని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆరోపించారు. కేవలం నరేంద్రమోదీ పాలనలో మాత్రమే భారత్ ప్రజలు సురక్షితంగా ఉండి శాంతిసౌభాగ్యాలతో జీవిస్తారని ఆయన ఉద్ఘాటించారు. పశ్చిమ ఒడిసా పట్టణంలో బుధవారం జరిగిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అందరి సహకారంతో దేశంలోని ఉగ్రవాదాన్ని సమూలంగా తుడిచిపెట్టాలన్న కృతనిశ్చయంతో బీజేపీ ప్రభుత్వం ఉందని అన్నారు. పుల్వామా దాడి తర్వాత మోదీ ప్రభుత్వం పలు కఠిన నిర్ణయాలు తీసుకుని పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికలను జారీ చేసిందని చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో శత్రుమూకలు దాడులు చేసేవరకు ఎలాంటి చర్యలకు పాల్పడవద్దని సైన్యానికి ఆదేశాలు ఇచ్చాయని, కాని తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉగ్రవాదులకు ఎలాంటి విచక్షణ ఉండదు కాబట్టి వారు దాడి చేసే వరకు వేచిచూడవద్దని, ముందే దాడి చేసి వారికి బుద్ధి చెప్పాలని భద్రతాదళాలకు ఆదేశాలు ఇచ్చామని ఆయన చెప్పారు. బీజేపీ ప్రభుత్వ పాలనలోనే ప్రజలు సురక్షితంగా ఉండగలరని ఆయన పేర్కొన్నారు. జమ్మూ, కాశ్మీర్‌లో తుపాకి చేతబడితే చావును కొనితెచ్చుకున్నట్టేనని ఆయన హెచ్చరిస్తూ ఈ మేరకు కఠినంగా వ్యవహరించాలని తమ ప్రభుత్వం ఆర్మీకి తగు ఆదేశాలు జారీ చేసిందని చెప్పారు. పుల్వామా సంఘటన తర్వాత తాము చేపట్టిన పలు చర్యల కారణంగా ఉగ్రమూకలు భయంతో చెల్లాచెదురయ్యాయని పేర్కొన్నారు. దేశం సురక్షితంగా ఉండాలంటే మోదీ మరోసారి ప్రధాని కావాలన్న ఆకాంక్షను యోగి ఆదిత్యనాథ్ వ్యక్తం చేశారు.