జాతీయ వార్తలు

యూపీలో తప్పని త్రిముఖ పోటీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: దేశంలోని అతిపెద్ద రాష్టమ్రైన ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ సీట్లకు త్రిముఖ పోటీకి రంగం సిద్ధమైంది. అఖిలేష్ యాదవ్ నాయకత్వంలోని సమాజ్‌వాదీ పార్టీ, మాయావతి నాయకత్వంలోని బీఎస్పీ గురువారం తాము పోటీ చేయవలసి లోక్‌సభ నియోజకవర్గాలను పంచుకోవటంతోత్రిముఖ పోటీ తప్పనిసరైంది. ఉత్తరప్రదేశ్‌లోని 80 లోక్‌సభ సీట్లనుండి బీఎస్పీ 38 సీట్లు, సమాజ్ వాదీ పార్టీ 37 లోక్‌సభ సీట్లలో పోటీ చేయాలని రెండు పార్టీల మధ్య ఇంతకుమునుపే ఒప్పందం కుదిరింది. ఎస్పీ, బీఎస్పీ పార్టీలు సీట్లసర్దుబాటు చేసుకున్నందుకు ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలోని మొత్తం 80 సీట్లలో తమ అభ్యర్థులను రంగంలోకి దించుతామని ప్రకటించింది. దీనితో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో త్రిముఖ పోటీకి రంగం సిద్ధమైంది. గురువారం నాడు ఏ పార్టీ ఏ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను రంగంలోకి దించాలనేది కూడా ఖారారు చేసుకున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ పోటీ చేసే అమేథీ, రాయబరేలీ సీట్లలో పోటీ చేయాలా.. వద్దా? అనే నిర్ణయాన్ని రెండు పార్టీల కూటమి వాయిదా వేసింది. బీఎస్పీ, ఎస్పీ పార్టీలు మొత్తం 75 సీట్లను పంచుకోవటం గమనార్హం. మూడు సీట్లను అజిత్ సింగ్ నాయకత్వంలోని రాష్ట్రీయ లోక్‌దళ్‌కు ఇచ్చారు. సమాజ్‌వాదీ పార్టీ రాష్ట్ర రాజధాని లక్నో, కాన్పూర్, అలహాబాద్, ఝాన్సీతోపాటు మొత్తం 37 సీట్లలో పోటీచేస్తే బీఎస్పీ అభ్యర్థులు మీరట్, ఆగ్రా, గౌతంబుధ్ నగర్ (నోయిడా), అలీగర్, సహరాన్‌పూర్ తదితర 38 సీట్లలో పోటీ చేస్తారు. అమేథీ, రాయబరేలీ సీట్లలో తమ అభ్యర్థులు పోటీ చేయరని మాయావతి గతంలోనే ప్రకటించటం తెలిసిందే. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్, రాజస్థాన్ శాసనసభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ తమతో పొత్తు పెట్టుకోనందుకు మాయావతి ఆగ్రహంతో ఉన్నారు. పొత్తులపై చర్చ జరుగుతున్న సమయంలో కాంగ్రెస్ అధినాయకత్వం తమతో గౌరవంగా వ్యవహరించలేదన్నది మాయావతి ఆరోపణ. అందుకే లోక్‌సభ ఎన్నికల కోసం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకునేందుకు నిరాకరించారు. ఎస్పీ, బీఎస్పీలు పొత్తు ఖరారు చేసుకున్నా సీట్ల పంపిణీ సమయంలో దిగివచ్చి తమతో ఒప్పందం చేసుకుంటారని కాంగ్రెస్ నాయకత్వం ఆశగా ఉండింది. అయితే అఖిలేష్ యాదవ్, మాయావతి తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేయవలసిన లోక్‌సభ నియోజకవర్గాలను కూడా ఖరారు చేసుకోవటంతో కాంగ్రెస్‌తో పొత్తు ఉండదనేది స్పష్టమైపోయింది. త్రిముఖ పోటీ మూలంగా ఉన్నత వర్గాల ఓట్లు ముఖ్యంగా బ్రాహ్మణ వర్గం ఓట్లు బీజేపీకి బదులు కాంగ్రెస్‌కు పడతాయని వారు వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఉత్తరప్రదేశ్ ఇంచార్జ్ ప్రియాం కా గాంధీ ఉత్తరప్రదేశ్‌లో పెద్ద ఎత్తున ప్రచారం చేసే పక్షంలో రాష్ట్రంలోని ప్రతిపక్ష ఓట్లు చీలిపోవటం ఖాయమని రాజకీయ విశే్లషకులు చెబుతున్నారు.
ఓట్లు చీలిపోయే పక్షంలో బీజేపీకి అత్యధిక ప్రయోజనం కలుగుతుందన్నది రాజకీయ పరిశీలకుల అంచనా. త్రిముఖ పోటీ మూలంగా అమేథీ, రాయబరేలీ నియోజకవర్గాల్లో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ గెలుపు కూడా కష్టమవుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాహుల్ గాంధీ అమేథీ, సోనియా గాంధీ రాయబరేలీ నియోజకవర్గాల నుండి పోటీ చేస్తారు, ప్రియాం కా గాంధీ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయటం లేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.