జాతీయ వార్తలు

‘సంచార జాతులకు 15శాతం రిజర్వేషన్లివ్వాలి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనకబడిన సంచార జాతులకు ఓబీసీ రిజర్వేషన్లలో 15 శాతం ప్రత్యేకంగా రిజర్వేషన్లు కల్పించాలని జస్టిస్ రోహిణి నేతృత్వంలోని ఓబీసీ వర్గీకరణ కమిషన్‌కు తెలంగాణ సంచార జాతుల సంఘం విజ్ఞప్తి చేసింది. ఢిల్లీలో జస్టిస్ రోహిణిని తెలంగాణ సంచారా జాతుల సంఘం సభ్యులు గురువారం కలిశారు. అనంతరం సంఘం ప్రధాన కార్యదర్శి గుండ్లపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ సంచార జాతులు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో వెనుక ఉన్నాయని, తమకు తగిన న్యాయం చేయాలని రోహిణిని కోరినట్టు చెప్పారు. సంఘం రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడు వీరాస్వామి, ప్రధాన కార్యదర్శి సమ్మయ్య, కోశాధికారి శ్రీనివాస్ ఓబీసీ వర్గీకరణ కమిషన్ కలిసిన వారిలో ఉన్నారు.