జాతీయ వార్తలు

సమాజ సేవ అలవర్చుకోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, ఫిబ్రవరి 22: ప్రతిఒక్కరూ సమాజ సేవ చేయాలనే దృక్పథాన్ని అలవర్చుకోవాలని, అందులోనే నిజమైన తృప్తి ఉందని భారత రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ పేర్కొన్నారు. శుక్రవారం నెల్లూరుజిల్లా వెంకటాచలంలోని స్వర్ణ్భారత్ ట్రస్ట్ 18వ వార్షికోత్సవ వేడుకల్లో ఉప రాష్టప్రతి ఎం.వెంకయ్యనాయుడుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్టప్రతి మాట్లాడుతూ ప్రతిఒక్కరూ తిరిగి గ్రామాలకు వెళ్లి సేవ చేయాలనే మహాత్మాగాంధీ పిలుపు అందరికీ మార్గదర్శకం అన్నారు. దేశంలో పేరెన్నికగన్న శాస్తవ్రేత్తలు, విద్యావంతులు, మేధావులు తనను కలిసేందుకు తరచూ రాష్టప్రతి నిలయానికి వస్తుంటారని, వారికి కూడా తాను ఇదే చెబుతుంటానని స్పష్టం చేశారు. ఏ స్థాయికెళ్లినా కేవలం మన ప్రతిభ మాత్రమే కాదని, సమాజంలోని ఇతరుల దీవెనలు, సహకారం కూడా అందుకు కారణమేనని అన్నారు. ఉన్నతస్థాయికి చేరుకున్నాక అవసరంలో ఉన్న వారిని ఆదుకోవాలని సూచించారు. తాను దేశవ్యాప్తంగా ఎన్నో ప్రాంతాలు తిరిగానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలు రైతులకందడం చూస్తున్నానని తెలిపారు. ముఖ్యంగా హెల్త్‌కార్డుల వల్ల రైతులు ఎంతో ప్రయోజనం పొందుతున్నారని, భూపరీక్ష ద్వారా ఏ పంట అనువుగా ఉంటుందీ, ఏయే రసాయనాలు వాడొచ్చు అనే విషయాలపై స్పష్టత వస్తోందన్నారు. ఎంతోకాలంగా ప్రజాజీవితంలో ఉన్న వెంకయ్యనాయుడికి పార్టీలకతీతంగా ఎందరో అభిమానులు, స్నేహితులు ఉన్నారని, ఒక విధంగా చెప్పాలంటే ఆయన అజాత శత్రువని కొనియాడారు. స్వర్ణ్భారత్ ట్రస్ట్ స్ఫూర్తితో దేశ వ్యాప్తంగా ఇతర ప్రాంతాల్లోనూ సేవా కార్యక్రమాలు జరగాలని ఆయన ఆకాంక్షించారు.
రాష్టప్రతి తెలుగు ప్రసంగం
రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ తన ప్రసంగాన్ని తెలుగులో ప్రారంభించారు. ‘స్వర్ణ్భారత్ ట్రస్ట్ 18వ వార్షికోత్సవంలో పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది.. ట్రస్ట్ సేవా కార్యక్రమాల గురించి తెలుసుకుని చాలా సంతోషంగా ఉంది. ఆరో గ్య, విద్య, నైపుణ్య రంగాలతో పాటు సంస్కృతిని తెలియచేయడం వంటి సామాజిక ప్రయోజన కార్యక్రమాలు చేపట్టడం ఎంతో ఆనందదాయకం’ అని తెలుగులో ప్రసంగించారు.
స్వర్ణ్భారత్ ప్రయోగం
తృప్తినిచ్చింది : ఉపరాష్టప్రతి
మహాత్మాగాంధీ, నానాజీ దేశ్‌ముఖ్‌ల స్ఫూర్తితో తాను ప్రారంభించిన స్వర్ణ్భారత్ ట్రస్ట్ ప్రయోగం తనకెంతో తృప్తినిచ్చిన అంశంగా మిగిలిపోయిందని ఉప రాష్టప్రతి ఎం.వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. విద్య, వైద్యం, ఉపాధి, సంస్కృతి అనే నాలుగు అంశాలపైన ప్రధానంగా స్వర్ణ్భారత్ ట్రస్ట్ దృష్టి పెట్టి ఆ దిశగా తన వంతు సేవలు అందిస్తోందన్నారు. ఉత్తరప్రదేశ్, ఝార్ఖండ్, బిహార్ రాష్ట్రాల నుండి కూడా యువత ఇక్కడకొచ్చి నైపుణ్య శిక్షణ పొంది తిరిగి తమ ప్రాంతాలకు వెళ్లి స్వయం ఉపాధి పొందుతుండడం తనకు ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. ప్రస్తుతం వెంకటాచలంతో పాటు విజయవాడ, హైదరాబాద్‌లలో మరో రెండు చాప్టర్లు ఏర్పాటు చేశామన్నారు. వంశపారంపర్య రాజకీయాలకు తాను వ్యతిరేకినని, తన కుమార్తె కూడా తనలానే సమాజసేవకు మాత్రమే పరిమితం కావడం తనకెంతో సంతోషం కలిగిస్తోందన్నారు. అభివృద్ధి ఫలాలు సమాజంలో అందరికీ అందాల్సిన అవసరం ఉందన్నారు. యువత కూడా పాశ్చత్య మోజులో పడి భారతీయ సంస్కృతీ సంప్రదాయాలను మర్చిపోవడం విచారకరమని, ఆ పాశ్చత్య మోహాన్ని వీడి రేపటి తరానికి మన సంస్కృతిని పరిచయం చేయాల్సిన బాధ్యత నేటి యువతపైనే ఉందని ఆయన హితవు పలికారు.
విద్యార్థులతో ముచ్చటించిన రాష్టప్రతి
అంతక్రితం స్వర్ణ్భారత్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడుస్తున్న అక్షర విద్యాలయాన్ని పరిశీలించిన రాష్టప్రతి రామ్‌నాథ్ కోవింద్ అక్కడి విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. అనంతరం అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం నూజివీడు ట్రిపుల్ ఐటి విద్యార్థులు చేసిన వందేమాతరం, నమో గంగ యోగా నృత్యరూపకాన్ని రాష్టప్రతి ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్, రాష్ట్ర మంత్రులు చల్లా అమర్‌నాథ్‌రెడ్డి, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, స్వర్ణ్భారత్ ట్రస్ట్ చైర్మన్ విష్ణురాజు, మేనేజింగ్ ట్రస్టీ దీపా వెంకట్ తదితరులు పాల్గొన్నారు.