జాతీయ వార్తలు

మహిళలు నాయకత్వ స్థానాల్లో దూసుకుపోవాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముంబయి, ఫిబ్రవరి 22: పరిశ్రమలు, ఇతర కంపెనీల్లో మహిళలుక్రియాశీలకంగా పనిచేసేందుకు అవకాశాలు ఉన్నా, వాటిని ఉపయోగించుకునేందుకు తగినంత మహిళలు ముందుకు రావడం లేదని బయోకాన్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా పేర్కొన్నారు. మహిళల్లో మంచి నాయకత్వ లక్షణాలు ఉన్నాయని ఆమె చెప్పారు. జూనియన్ మేనేజిమెంట్ స్థాయిలో ఉన్న విస్తృతమైన అవకాశాలను ఉపయోగించుకునేందుకు మహిళలు కదలాలన్నారు. కాగా వచ్చే ఐదేళ్ల నుంచి పదేళ్లలో మహిళలు పెద్ద సంఖ్యలో నాయకత్వ స్థానాల్లో పనిచేసేందుకు ముందుకు వస్తారని ఆశిస్తున్నట్లు ఆమె చెప్పారు. శుక్రవారం ఇక్కడ నాస్కామ్ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కిరణ్ మజుందార్ షా మాట్లాడారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని వ్యాపార రంగంలో ముందడుగు వేయాలన్నారు. ఉత్పత్తుల మార్కెటింగ్‌లో టెక్నాలజీ అవసరం ఉందన్నారు. బెంగళూరులో బయోఫార్మాసూటికల్ కంపెనీ ప్రధాన కార్యాలయం ఏర్పాటు చేశామని, ముందుగా ఎటువంటి అంచనాలు వేయకుండా రిస్క్ తీసుకుని నెలకొల్పామన్నారు. ప్రతి మహిళ వ్యాపార రంగంలో రిస్క్‌కు సిద్ధంగా ఉండాలన్నారు. వ్యాపార రంగంలో సక్సెస్ రేటు అనేది రిస్క్‌ను బట్టి ఉంటుందన్నారు. మన సంస్కృతి రిస్క్‌ను భరించడమనే విషయాన్ని పరిగణనలోకి తీసుకోదని, ఎంతసేపు విజయం గురించి ఆలోచిస్తుందన్నారు. తాను వ్యాపార రంగంలో రిస్క్‌కు ప్రాధాన్యత ఇస్తానన్నారు, రిస్క్ లేకుండా విజయాలు వరించవన్నారు. భారతదేశంలో మహిళలు ఉన్నత స్థానాలు అధిరోహించేందుకు తగిన మంచి వాతావరణం ఉందన్నారు. నాయకత్వ లక్షణాలను అభివృద్ధి చేసుకోవాలని, ముందస్తు అంచనాలతో రిస్క్‌ను భరించేందుకు సిద్ధంగా ఉంటే మంచి ఫలితాలువస్తాయన్నారు. మహిళలు మార్కెట్‌లోఅవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు.