జాతీయ వార్తలు

ఐక్యతా విగ్రహం వద్దకు ప్రత్యేక రైళ్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: గుజరాత్‌లోని ఐక్యతా విగ్రహం వద్దకు రైల్వేశాఖ ప్రత్యేక రైళ్లను నడపనుంది. మార్చి 4 నుంచి సర్దార్ పటేల్ విగ్రహం వద్దకు పర్యాటకులను ఆకర్షించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నారు. ఐదు నెలల క్రితమే ప్రధాని నరేంద్రమోదీ ఐక్యతా విగ్రహాన్ని ఆవిష్కరించారు. భారత్ దర్శన్ పథకం కింద ఈ ప్రత్యేక రైళ్లను నడపనున్నట్టు మంత్రిత్వశాఖ వెల్లడించింది. ఏడు రాత్రులతో కూడిన ఎనిమిది రోజుల టూర్ ప్యాకేజీ మార్చి 4న నుంచి చండీగఢ్ నుంచి మొదలవుతుందని రైల్వేశాఖ తెలిపింది. ఉజ్జయినిలోని మహాకాళేశ్వర జ్యోతిర్లింగ, ఇండోర్‌లోని ఓంకారేశ్వర జ్యోతిర్లింగ, షిర్డీ సాయిబాబా దర్శన్, నాసికల్‌లోని త్రియాంబకేశ్వర, ఔరంగబాద్‌లోని ఘరిష్‌నేశ్వర్ జ్యోతిర్లింగలను సందర్శించవచ్చు. ఒక్కో ప్రయాణికుడి నుంచి రూ. 7,560 వసూలు చేస్తారు. చండీగఢ్, అంబాలా, కురుక్షేత్ర, కర్నాల్, పానిపట్, ఢిల్లీ కంటోనె్మంట్, రేవారీ, అల్వాల్, జైపూర్ స్టేషన్లలో ప్రత్యేక రైలు ఆగుతుంది. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని దర్శించాలన్న ఉద్దేశంతోనే ఈ ప్యాకేజీ రూపకల్పన చేసినట్టు రైల్వే వర్గాలు తెలిపాయి. ప్రత్యేక రైలు వదోదర స్టేషన్‌లో ఆగుతుంది. అక్కడ నుంచి ప్రయాణికులను బస్సుల్లో ఐక్యతా విగ్రహం వద్దకు తీసుకెళ్తారు. గుజరాత్‌లోని నర్మదానది వద్ద పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ప్రపంచంలోనే ఎత్తయిన విగ్రహం. విగ్రహం ఎత్తు 182 మీటర్లు. ఈ ప్రత్యే క రైళ్లలో నాన్-ఏసీ స్లీపర్ కోచ్‌లు ఉంటాయి. రాత్రిళ్లు ప్రయాణికులు బస చేయడానికి హాళ్లు లేదా డార్మెటరీ సదుపాయం ఉంటుంది. దగ్గరలోని పుణ్యక్షేత్రాలకు వెళ్లడానికి వాహనాలు ఏర్పాటు చేస్తారు. శకాహార భోజనం ఉంటుందని ప్యాకేజీ మేనేజర్ వెల్లడించారు. నర్మదా జిల్లాలోని కవాడియా కాలనీలో సర్దార్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. కట్టడం పర్యాటకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. నవంబర్ 8 నుంచి మూడు రోజుల్లోనే రూ. కోటీ 26లక్షల రూపాయల ఆదాయం వచ్చింది. రోజూ వేలాది మంది పర్యాటకులు ఐక్యతా విగ్రహాన్ని చూస్తున్నారు.