జాతీయ వార్తలు

మోదీ ప్రైం టైం మినిష్టర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 22: ఒకపక్క యావద్భారతం శోకసముద్రంలో మునిగిపోతే ప్రధాని నరేంద్రమోదీ మరోపక్క ఫొటోషూట్‌లో తలమునకలయ్యారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ తీవ్ర స్వరంతో విరుచుకుపడ్డారు. పుల్వామాలో 54మంది జవాన్లను మిలిటెంట్లు పొట్టనపెట్టుకోవడం మొత్తం దేశానే్న, బాధిత కుటుంబాలను దిగమింగుకోలేని విషాదానికి గురి చేస్తే మోదీ మాత్రం నవ్వులు చిందిస్తూ ఫొటోషూట్‌లో పాల్గొనడం దిగ్భ్రాంతికరమని రాహుల్ అన్నారు.
ఫొటో షూట్ సర్కార్ అంటూ కేంద్రంపై విరుచుకుపడ్డ రాహుల్ మోదీ ‘ప్రైం టైం మినిష్టర్’గా అభివర్ణించారు. పుల్వామా విషాద ఘటనకు సంబంధించిన వార్తలు వెలువడిన తర్వాత కూడా మూడు గంటల పాటు మోదీ ఒక ఫిలిం షూటింగ్‌లోనే కొనసాగారని రాహుల్ విమర్శించారు.
రాత్రికి రాత్రే ఆనకట్టలు కడతారా?
కాశ్మీర్‌లో పాక్ ఉగ్రదాడి నేపథ్యంలో ఆ దేశానికి ఇచ్చే నీటి వాటాను నిలిపివేస్తామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటించడాన్ని కాంగ్రెస్ తప్పుబట్టింది. పాకిస్తాన్ చర్యలకు నిరసనగా సింధు జలాల ఒప్పందం మేరకు పాకిస్తాన్‌కు పంపాల్సిన నీటి వాటాను ఆ దేశానికి పంపకుండా అడ్డుకుంటామని నితిన్ గడ్కరీ బుధవారం ప్రకటించిన విషయం తెలిసిందే. మన రక్షణ వైఫల్యాలను కప్పిపుచ్చడానికి ప్రభుత్వం చేసిన అత్యంత తీవ్రస్థాయి కవ్వింపు చర్య ఇదని ఆయన వ్యాఖ్యానించారు. దీనిని కాంగ్రెస్ తప్పుబడుతూ ‘అంటే రాత్రికి రాత్రే మన నదులపై ఆనకట్టలను మీరు కడతారా?’ అని గడ్కరీని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ తివారి ప్రశ్నించారు. భారతదేశ భద్రతకు భంగం కలిగించేలా మోదీ చేసే ఏ చర్యను తాము సహించమని ఆయన పేర్కొన్నారు. పాకిస్తాన్‌కు చెందాల్సిన నీటిని నిలిపివేసి తూర్పు ప్రాంత నదులకు తరలించి జమ్మూకాశ్మీర్, పంజాబ్ రాష్ట్రాలకు మరింత నీరు ఇస్తామని గడ్కరీ పేర్కొనడాన్ని ఆయన తప్పుబట్టారు. ఇలావుండగా గడ్కరీ ప్రకటనపై ఒక ఉన్నతాధికారి వివరణ ఇస్తూ ఇది కొత్తగా తీసుకున్న నిర్ణయమేమీ కాదని స్పష్టం చేశారు. గతంలోనే నీటి వనరుల శాఖ చాలాసార్లు పేర్కొందని ఆయన పేర్కొన్నారు.